కూరగాయల ధరలు పైపైకి
కూరగాయల ధరలు పైపైకి
అమాంతంగా పెరిగిన టమాటా ధరలు తగ్గిన దిగుబడులతో ధరలకు రెక్కలు
విజయవాడ, జూన్ 24 (పీపుల్స్ మోటివేషన్):
వర్షాభావంతో మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి. పంటల దిగుబడి తగ్గడంతో మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.. వర్షాలు పడకపోవడంతో కొత్త పంటలకు ఇంకా సమయం ఉంది. రూ.100కు రెండు, మూడు కూరగాయలు కూడా రావడం లేదు. వ్యాపారులను అడిగితే పంట తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒక పక్క ఎండ సెగ.. మరో వక్క కూరగాయల ధరల మంట చూసి నగరవాసులు ఉసూరుమనాల్ని వస్తోంది.. ఎండల తీవ్రత కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది.
కూరగాయలు పండించే రైతులకు నీరందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయి దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి, ప్రజలు నిత్యం వినియోగించే టమాటా చుక్కలు. చూపిస్తోంది. ఇప్పటికే మళ్లీ 50 నుంచి 75 రూపాయలకు చివరకు వంద కిలో పెరిగింది. నిత్యం వాడే ఉల్లి ధరలు మళ్లీ 35 పైనే పలుకుతున్నాయి. ఎండాకాలంలో పంటల విస్తీర్ణం పరిమితమైంది. దిగుబడి కూడా సగానికి తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో నగరానికి రావాల్సిన కూరగాయల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు. వేసవి ప్రభావం తీవ్రంగా ఉండటంతో భూమిలోని తేమ గంటల వ్యవధిలో ఆవిరవడంతో.
పంటలకు నీరు అందని పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోవడంతో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. ఎండ తీవ్రతకు, వడ గాలులకు నచ్చిన పూత కూడా రాలిపోవడంతో కాయలుకాయడం లేదని అంటున్నారు.
టమోటా క్రేటు (30కిలోలు) ధర గతంలో రూ.200 నుంచి రూ.300 ఉండగా ఇప్పుడు రూ.1200 పలుకుతోంది. కర్స్, బెండ, వీర్ఘ ధరలు పావుకు 30కి తక్కువగా లేవు బీన్స్ వందకు పావు అమ్ముతున్నారు. అన్ని కూరగాయల ధరలు దాదాపు ఇదే తీరులో పెరిగాయి. టమోటా, వీర, గోరు చిక్కుడు సాగు చేసిన రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడిప్పుడే కాపు మొదలైందనుకున్న దశలో ఎండలకు ఉన్న పంట కాస్తా చేతికందకుండా పోతోంది. ఎండ తీవ్రత కారణంగా పంట ఎండిపోయిది. పెట్టుబడి కూడా చేతికి వస్తుందన్న సమ్మకం లేదని కూరగాయల రైతులు వాపోతున్నారు. ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉండి, వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి పంటలు ఎండిపోతాయి. ఇప్పటికే 80 శాతం. కూరగాయల పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. దిగుబడి ఇంకా పడిపోయి మార్కెట్ కు కూరగాయలు రావడం కష్టమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయని నగర మార్కెట్లకు సరఫరా చేస్తున్న వ్యాపారులు అంటున్నారు. ఇలాగే ఎండలు కొనసాగితే ధరలు మరింతగా మండే ప్రమాదం కనిపిస్తోంది.