-Advertisement-

Health tips: 'టీ'ని ఇలా చేసి తాగుతున్నారా...!!

Benefits of drinking tea everyday Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news
Pavani

Health tips: 'టీ'ని ఇలా చేసి తాగుతున్నారా...!!

• టీ'ని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా..

• ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం..

• టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్గా మారిపోతుంది..

టీ' అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, మిల్క్ టీలను తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే చాలా మందికి ఇష్టం. పాలలో ఎక్కువ టీ ఆకులు వేసి ఎక్కువసేపు మరిగించి తయారుచేసిన టీని ఇష్టపడేవారు కొందరు ఉంటారు. అయితే టీ ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం ఉంది. టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Benefits of drinking tea everyday Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news

టీ ఎంతసేపు మరిగించడం మంచిది..?

టీ రుచిగా, ఆరోగ్యంగా ఉండటానికి 4-5 నిమిషాలు మాత్రమే మరిగించాలి.

ఎక్కువ సేపు మరిగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు

శరీరంలో ఐరన్, కాల్షియం లోపం 

మిల్క్ టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల అందులోని టానిన్ల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దీనితో పాటు.. అధిక టానిన్ కంటెంట్ శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. ఆ కారణంగా రక్తహీనత భయం ఉంటుంది.

ఆమ్లత్వం పెరుగుతుంది 

మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని pH మారుతుంది.. టీ మరింత ఆమ్లంగా మారుతుంది.

క్యాన్సర్ ప్రమాదం మిల్క్ టీని అతిగా మరిగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉత్పత్తి అవుతుంది.

జీర్ణ సమస్యలు

మరిగించిన పాలతో టీ తాగడం వల్ల ఎసిడిటీ, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

రక్తపోటును పెంచుతుంది

మరిగించిన టీని మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరుగుతుంది.. ఇది రక్తపోటును పెంచుతుంది.

రుచి మారుతుంది 

మిల్క్ టీని ఎక్కువగా మరగబెట్టడం వల్ల దాని రుచి మారుతుంది.

పోషకాల నష్టం 

మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల పాలలో ఉండే ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలను నాశనం చేస్తుంది.

Comments

-Advertisement-