తీపిలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మామిడి ‘రారాజు’..
తీపిలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మామిడి ‘రారాజు’..
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండు ఒకటి. పండ్లకు రారాజు మామిడి పండు. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టమే. అయితే.. మార్కెట్‌లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్లు ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.మామిడిపండు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.. జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో అజీర్ణం, మలబద్ధకం లేదా అసిడిటీ వంటి సమస్యలు ఉంటే.. మీరు ఈ జ్యూసి పండును తింటే మంచిది.హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.మామిడి రుచికి మాత్రమే కాదు.. గుండెకు కూడా మేలు చేస్తుంది. మామిడి పండు తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇది తినడం వల్ల లిపిడ్ స్థాయిలు, వాపును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.