పిల్లలు పుట్టడానికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందా?
పిల్లలు పుట్టడానికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందా?
మాతృత్వపు అనుభూతిని పొందడం ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప వరం. ఒకప్పుడు చాలా చిన్న ఏజ్లోనే పెళ్లీలు జరిగేవి, బిడ్డకు జన్మను కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. మూడు పదుల్లో పెళ్లి చేసుకోవడం, పెళ్లైన మూడు లేదా నాలుగు సంవత్సరాల వరకు పిల్లల గురించి ప్లాన్ చేసుకోకపోవడం అనేది నయా ట్రెండ్ అయిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం సంతానలేమి సమస్యలు కూడా అధికం అవుతున్నాయి. దీని కారణం వయసు అని కూడా కొందరు అంటున్నారు. అయితే పిల్లలు పుట్టడానికి కూడా ఓ ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా?
దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి జరిగింది. అందరూ ఇక ఓ కొడుకును కని ఇవ్వండి అని సరదాగా అయినా తమ మనసులో మాట బయట పెడుతుంటారు. కానీ ఆ జంట మాత్రం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తాం అనే ధోరణిలో ఉంటుంది. అదే విషయాన్ని తమ పేరెంట్స్కు కూడా చెబుతున్నారు. కానీ, వారు వినరు ఏజ్ పెరిగితే పిల్లలు పుట్టరు, మాకు అయితే వారసుడిని ఇవ్వండి అని వాదిస్తున్నారు. మరి నిజంగానే ఏజ్ దాటితే పిల్లలు పుట్టరా అంటే? అలాంటిది ఏమీ లేదు అంటున్నారు నిపుణులు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన ఓ సర్వే రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. మహిళలు పిల్లలు కనకుండానే తన ఏజ్ 30ని దాటేస్తున్నారని, మరీ ముఖ్యంగా 900లో పుట్టిన మహిళలు పిల్లలను కనడానికి ఇష్టం చూపని ధోరణిలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లేట్ మామ్ ధోరణి కొనసాగుతుందని, కానీ ఇది మహిళ ఆరోగ్యంపై పుట్టే బిడ్డపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని వారు తెలుపుతున్నారు. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు కూడా కొన్ని కండీషన్స్ ఉంటాయి, గర్భం దాల్చడం అనేది చిన్న విషయం కాదు, ఎన్నో సమస్యలతో కూడుకున్నది. కానీ చాలా మంది త్వరగా పిల్లలను కనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు, మగవారు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు అని పేర్కొన్నారు.