Intresting Facts: ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుని బియ్యంలో రాళ్లు ఏరకూడదట..ఎందుకో తెలుసా ?
Daily telugu
Daily trending news
Breaking news telugu
Telugu news
Telugu stories
Crime News
Politics news
Current Affairs pdf
Daily news updates
By
Pavani
ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుని ఈ పనులు చేయవచ్చా..?
తలలో పూలు పెట్టుకుని బియ్యంలో రాళ్లు ఏరకూడదు..
చావు ఇంటికి పూలు పెట్టుకుని వెళ్లకూడదట..
మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొందరు మహిళలు కొన్ని సంప్రదాయాలను వదిలేస్తున్నారు. మరీ ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు తెలుగు సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. పొద్దున్నే లేవడం.. ఇల్లు ఊడ్చి ఇంటి ముందు ముగ్గుపెట్టడం వంటివి అసలు మరిచిపోయారు. కొన్ని ఇతర ముఖ్యమైన నియమాలను నేటి మహిళలు పాటించడం లేదు.
ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మన పెద్దలు మనకు ఎన్నో మంచి అలవాట్లు నేర్పుతారు. వాళ్లు కూడా మంచి మాటలు చెబుతారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే వార్త వైరల్‌గా మారింది. పెళ్లయిన ఆడవాళ్లు .. ముత్తైదువులు తలలో మల్లెపూలు పెట్టుకొని చాటలో బియ్యం చెరగకూడదు .. మల్లెపూలు మాత్రమే కాదు ఏ పూలు పెట్టుకుని కూడా చాటలో బియ్యం లో రాళ్లను ఏరకూడదు.ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మన పురాణాల ప్రకారం స్త్రీలు తలపై పూలు పెట్టుకొని చాటలో బియ్యం లోని రాళ్లు చూడకూడదట. అంతేకాదు ఏదైనా చావు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకొని వెళ్ళకూడదు . ఈ నియమాలు చాలామంది నేటి కాలంలో పాటించడం లేదు. కొంత మందికి తెలిసిన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు.. కొందరు తెలియక తప్పు చేస్తున్నారు.. దీంతో మరొకసారి పెద్దలు ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు
Comments