DLS: డీఎల్ఎస్ పద్ధతి సహా రూపకర్త ఫ్రాంక్ డక్వర్త్ మృతి!
DLS: డీఎల్ఎస్ పద్ధతి సహా రూపకర్త ఫ్రాంక్ డక్వర్త్ మృతి!
డీఎల్ఎస్ పద్ధతి సహ సృష్టికర్త మృతి..
2001లో డీఎల్ఎస్ పద్ధతి..
లూయిస్ 2020లో కన్నుమూత..
డక్వర్త్ క్రికెట్ గణాంక నిపుణుడు, డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి సహ సృష్టికర్త ఫ్రాంక్ డక్వర్త్ మృతి చెందారు. ఆయన వయసు 84. వృద్ధాప్య సమస్యలతో జూన్ 21న ఫ్రాంక్ డక్ వర్త్ తుదిశ్వాస విడిచారు. డక్ వర్త్ మరణవార్త కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఆయన మరణవార్తను ద్రువీకరించింది. ఫ్రాంక్ డక్ వర్త్ మరణం పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో డీఎల్ఎస్ పద్దతి ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. టోనీ లూయిస్తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని ఫ్రాంక్ డక్వర్త్ రూపొందించారు. డీఎల్ఎస్ పద్ధతిని ఐసీసీ 1997లో తొలిసారిగా అమలు చేసింది. వర్షప్రభావిత మ్యాచ్ల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో డీఎల్ఎస్ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది.
అయితే ఈ డీఎల్ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్)గా నామకరణం చేశారు. లూయిస్ 2020లో కన్నుమూయగా.. తాజాగా ఫ్రాంక్ డక్వర్త్ తుదిశ్వాస విడిచారు.
2014లో ఫ్రాంక్ డక్ వర్త్ క్రికెట్కు దూరమయ్యారు. 2014లో పదవీ విరమణ చేసే ముందువరకు ఐసీసీలో కన్సల్టెంట్ స్టాటిస్టిషియన్గా ఉన్నారు. అతను క్రీడకు చేసిన సేవలకు 2010లో 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' మెంబర్ ఆఫ్ గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాంక్ డక్ వర్త్ మరణించినా.. అతడి పేరు మాత్రం క్రికెట్ చరిత్రలో మిగిలిపోనుంది.