Telephone: టెలిఫోన్ వైరు..రింగురింగులుగానే ఎందుకు ఉంటుందో తెలుసా?
Picture of the first telephone by Alexander Graham Bell
History of the telephone
History of the telephone
Who invented telephone Interesting news
By
Pavani
Telephone: టెలిఫోన్ వైరు..రింగురింగులుగానే ఎందుకు ఉంటుందో తెలుసా?
రకరకాల ఆకృతుల్లో ఉన్న వస్తువులను మనం చూస్తుంటాం. కానీ, అవి ఆ ఆకారంలోనే ఎందుకున్నాయో పెద్దగా పట్టించుకోం.ఆ కోవకు చెందిందే టెలిఫోన్ (Telephone) రిసీవర్ వైరు. ఇప్పుడైతే సెల్ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్నారు కానీ, కొన్నాళ్ల కిందటి వరకు ఇవే ఆధారం. ఇప్పటికీ పలు కార్యాలయాల్లో ఎక్స్టెన్షన్గా వీటినే ఉపయోగిస్తుంటారు. అయితే, అందులోని రిసీవర్ వైరు ఉంగరాలు తిరిగి ఉంటుంది. అది కచ్చితంగా ఆలాగేఎందుకుండాలి? సాధారణ వైరులా ఉండొచ్చు కదా? అని మీకెప్పుడూ అనుమానం రాలేదా?దీని వెనక ఉన్న ప్రధాన కారణం సౌలభ్యమేనట. రింగురింగులుగా ఉండే స్పైరల్ కేబుల్ వాడటం వల్ల కొంత వరకు సాగి, తిరిగి యధాస్థానానికి చేరుకునేందుకు వీలుంటుంది. ఫోన్కు ఒకవేళ దూరంగా ఉన్నా.. ఫోన్ బాక్సును కదపకుండానే రిసీవర్ను మన చెవి వరకు లాక్కోవచ్చు. సాధారణ కేబుల్ వైర్లలో ఇది సాధ్యపడదు. పక్కపక్కనున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడినప్పుడు రిసీవర్ చేతులు మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వైరు చిక్కులు పడకుండా,పాడవ్వకుండా ఉండాలంటే స్పైరల్ కేబుల్ వాడటమే ఉత్తమం. కేవలం టెలిఫోన్ రిసీవర్లలోనే కాదు సెల్ఫోన్ ఛార్జర్లు, కీ చైన్లలోనూ ఈ తరహా స్పైరల్ కేబుల్స్ కనిపిస్తుంటాయి.
Comments