-Advertisement-

Health tips: ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి!

Small changes more benefits in life health tips health news lifestyle benefits losses uses advantage and disadvantages and side effects food tips news
Priya

ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి!

ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులే చేసుకోవాలనేమీ లేదు. చిన్నవైనా ఎంతో మేలు చేస్తాయి. అవేంటంటే?

Small changes more benefits in life health tips health news lifestyle benefits losses uses advantage and disadvantages and side effects food tips news


ఆరోగ్యంగా ఉండటం కోసం లైఫెయిల్లో పెద్ద పెద్ద మార్పులు చేయాలి అనుకుంటుంటారు కొందరు. కానీ చిన్నపాటి మార్పులు చాలా మేలు చేస్తాయి. అవేంటి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయో చూద్దాం! 

భోజనంతో పాటు ఓ పండు

రోజుకు ఐదు సార్లు పండ్లు (Fruits) తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. దీన్ని గుర్తుంచుకోవటం కష్టమనుకుంటే భోజనం, టిఫిన్ చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక పండు తినటం అలవాటు చేసుకోండి. దీంతో కనీసం మూడు సార్లయినా పండ్లు తిన్నట్టు అవుతుంది. పండ్లలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల వంటివి గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు (Health Issues) తగ్గేలా చేస్తాయి.

సంచి బరువు కాస్త తగ్గినా..

వీపులకు, భుజాలకు తగిలించుకునే సంచులను ఎప్పటికప్పుడు తరచి చూసుకోండి. అవసరం లేనివాటిని వెంటనే తీసేయండి. ఇలాంటి వాటి బరువు మన శరీర బరువులో 10% కన్నా మించకుండా చూసుకోవటం మంచిది. ఇలా మెడ, వెన్ను,

భుజం నొప్పుల (Back Pain) బారినపడకుండా కాపాడుకోవచ్చు.

చక్కెర చిటికెడు తగ్గించి..

చక్కెరతో జీవక్రియలు, మెదడు పనితీరు మందగిస్తాయి. దీన్ని ఒకింత తగ్గించి పెరుగు, మజ్జిగ వంటి ప్రొ-బయోటిక్ పదార్థాలను మరింత పెంచుకోవటం మంచిది. ఎందుకంటే చక్కెర (Sugar), శుద్ధిచేసిన ధాన్యాలతో చేసిన ఉత్పత్తులను తగ్గించటంతో పాటు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయోటిక్ పదార్థాలను తీసుకుంటే ఈస్ట్ ఇనెఫెక్షన్లు తగ్గుతున్నాయన్నది నిపుణుల సూచన.

ప్రయాణాల్లో విరామం

ఎక్కువసేపు ప్రయాణాలు (Travelling) చేస్తుంటే మధ్య మధ్యలో విరామం తీసుకోవటం, అటూ ఇటూ నాలుగైదు అడుగులు వేయటం ఎంతైనా అవసరం. దీంతో కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసుకోవచ్చు ఒక కాలును వెనక్కి జరిపి, రెండో కాలును చిన్నపాటి ఎత్తు మీద పెట్టి, శరీరాన్ని ముందుకు సాగదీసే ప్రయత్నం చేసినా మంచిదే. కూర్చున్నప్పుడు కదలకుండా ఉండిపోయిన తొడ, వీపు కండరాలు సాగటానికి తోడ్పడుతుంది.

Comments

-Advertisement-