Food: అరే ఎంత తిన్నా ఆకలి వేస్తుందా..!
Food: అరే ఎంత తిన్నా ఆకలి వేస్తుందా..!
అరె... ఇందాకే తిన్నా కదా! అయినా ఆకలి అనిపిస్తోందేంటి?' అంటూ ఏదో ఒక తినుబండారం కోసం వెతకడం! తీరా తిన్నాక ‘మరీ ఎక్కువగా తినేస్తున్నా, బరువు పెరుగుతున్నా' అని బాధపడటం.
ఇలా మీకూ జరుగుతోందా? దానికి కారణాలేంటో తెలుసా?
మనకు ఎక్కువ మొత్తంలో ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్స్, కొవ్వులు అవసరమవుతాయి. ప్రొటీన్... గ్లూకగాన్ వంటి హార్మోను విడుదలకుకారణమవుతుంది. దీంతో కడుపు నిండినట్లుగా అనిపించి, ఆకలి భావనను దరిచేరనీయదు. అదే అది తగినంత పరిమాణంలో శరీరానికి అందకపోతే ఇలాంటి భావన కలుగుతుంది. కాబట్టి, ప్రొటీన్ సరిగా అందుతోందా అన్నది చెక్ చేసుకోండి.
పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారా? ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు ఆహారంపైకి మనసు మళ్లకుండానూ చూస్తుంది. శరీరానికి ఇది తగినంత అందకపోయినా ఇలా ఆకలి అనిపిస్తుంది. అందుకే ఫైబర్ అధిక మోతాదులో అందించే ఆహారాన్ని తీసుకోవాలి.
డైట్ అంటే చాలామందికి తక్కువ
మోతాదులో తినడమే! కానీ మన
శరీరంలో పెచ్ రెపెపార్' ఉంటాయి.
శరీరంలో 'స్ట్రెచ్ రెసెప్టార్స్' ఉంటాయి. ఇవి తీసుకున్న పరిమాణం బట్టే కడుపు నిండిందా లేదా అన్న అంచనాకి వస్తాయి. నిండకపోతే మెదడుకి ఆకలి సంకేతాలను పంపిస్తాయి. కాబట్టి, కడుపు నిండా తినండి... కాకపోతే కెలోరీలు తక్కువ ఉండేలా చూసుకుంటే చాలు. కడుపూ, మనసూ రెండూ నిండిపోతాయి.
మన శరీరంలో ఉండే ప్రధాన హార్మోన్లలో లెప్టిన్ కూడా ఒకటి. ఇది కడుపు నిండిందన్న సంకేతాన్ని మెదడుకు చేరవేస్తుంది. ఇది సరిగా ఉత్పత్తి కాకపోతేనే ఇదిగో ఇలా ఎంత తిన్నా మనసు ఆహారంకేసి లాగేస్తుంది. కాబట్టి, హార్మోనుల్లో అసమతుల్యత ఉందేమో చెక్ చేసుకోవాలి. లేదంటే బరువూ అదుపులో ఉండదు. ఒత్తిడి కూడా అతిగా ఆహారం ముఖ్యంగా స్వీట్లు, జంక్ ఫుడ్వైపు మనసు మళ్లేలా చేస్తుంది. కాబట్టి, దీన్నీ చెక్ చేసుకోవాలి.
సరిగా నిద్రపోతున్నారా? నిద్రలో శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుందని తెలుసుగా? కానీ ఇంటి పనులు, కుటుంబానికి అన్నీ అమర్చాలని మనం దాన్నే నిర్లక్ష్యం చేస్తాం. కానీ తగినంత నిద్రలేకపోతే జీవక్రియలన్నీ కుంటుపడతాయి. హార్మోనుల్లో సమస్యలు ఏర్పడి అతిగా ఆకలేస్తుంది. కాబట్టి, రోజులో 7 గంటలు నిద్రకు కేటాయించడం తప్పనిసరి.