-Advertisement-

Health tips: అధిక బరువు తగ్గాలంటే.. ఈ జ్యూస్ తాగితే సరి..!

Keera Dosha Benefits Health news health tips Telugu health benefits Telugu health losses in Telugu Healthand fitness Lifestyle news weight loss tips
Pavani

కొవ్వు తగ్గాలంటే.. ఈ జ్యూస్ తాగితే సరి..!

కీరదోస కాయ జ్యూస్ వరుసగా ఐదు రోజుల పాటు తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు.. తగ్గిన శారీరక శ్రమ.. నిద్ర వేళల్లో తేడాలు.. ఉద్యోగ టెన్షన్లు.. తదితర కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కరించుకోవడానికి తేలికైన మార్గం ఉందని చెబుతున్నారు. కీర దోస జ్యూస్ సరైన పరిష్కారం అంటున్నారు.

Keera Dosha BenefitsHealth news health tips Telugu health benefits in Telugu health losses in Telugu

దోస కాయలతో జ్యూస్ చేయడానికి వాటిని ముక్కలుగా కట్ చేయాలి. అయితే, వాటిని కట్ చేస్తున్నప్పుడు తొక్కలు తీయొద్దు. తొక్కలోనూ పలు రకాల పోషకాలు ఉంటాయి. ఈ ముక్కలు మిక్సీ జార్‌లో వేసి, కొన్ని కరివేపాకు ఆకులు, నీరు పోసి మిక్స్ చేసి గ్లాస్ లో తీసుకోవాలి. తాగే ముందు నిమ్మకాయలో సగం చెక్క రసం, కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి. ప్రతి రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగొచ్చు. ఎప్పుడు తాగినా అంతకు ముందు రెండు గంటల పాటు కడుపు ఖాళీగా ఉండాలన్న సంగతి మరిచిపోవద్దు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించేస్తుంది. శరీరం బరువు కూడా చాలా వేగంగా తగ్గిపోతుంది కూడా.కీర దోసలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ జ్యూస్ తాగినప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువగా ఉండటంతోపాటు తొందరగా ఆకలి కాదు. దీంతో తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. వేసవిలో కీర దోస ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో కీర దోస తినడం గానీ, జ్యూస్ గానీ తీసుకుంటే డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.

Comments

-Advertisement-