Jackfruit: పనస విత్తనాల ఆరోగ్య ప్రయోజనాల తెలుసా..!!

పనసపండు అంటే అందరికీ ఇష్టం. బాగా పండిన పనస తొనల రుచిని మాటల్లో వర్ణించలేం. పనస పండు ఎంత పాపులర్ అంటే.. రైమ్స్ లోనూ, పొడుపు కథలలోనూ దీన్ని భాగం చేశారు. అయితే చాలామంది పనస తొనలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు. మరికొందరు వీటిని ఉడికించి, ఇంకొందరు నిప్పులలో కాల్చి తింటారు. కానీ..
పనసపండు అంటే అందరికీ ఇష్టం. బాగా పండిన పనస తొనల రుచిని మాటల్లో వర్ణించలేం. పనస పండు ఎంత పాపులర్ అంటే.. రైమ్స్ లోనూ, పొడుపు కథలలోనూ దీన్ని భాగం చేశారు. అయితే చాలామంది పనస తొనలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు. మరికొందరు వీటిని ఉడికించి, ఇంకొందరు నిప్పులలో కాల్చి తింటారు. కొందరు సంప్రదాయ వంటలలో పనస విత్తనాలు వాడతారు. అయితే పనస విత్తనాలలో చాలామందికి తెలియని పోషకాలు ఉన్నాయి. అవేంటో.. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

పనసపండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్-బి, రిబోఫ్లావిన్, థయామిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్ మొదలైనవన్నీ ఉంటాయి. ముఖ్యంగా పనస గింజలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.
ముఖ్యంగా పనస గింజలలో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముకలు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!
భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియాతో ఇబ్బంది పడుతున్నారు. అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్య. ఐరన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అయితే పనస పండు గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. పనస గింజలు పడేయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్ లోపం భర్తీ చేయవచ్చు.