Weather: ఐఎండి కీలక ప్రకటన ఇప్పటివరకు సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు..!
Weather: ఐఎండి కీలక ప్రకటన ఇప్పటివరకు సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు..!
వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన
20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని వెల్లడి
రుతుపవనాలు పుంజుకోగానే భారీ వర్షాలు కురిసే అవకాశం
దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదు కాగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది.
వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు. ఇవి అన్నదాతలు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. అయితే రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడిందని.. అవి కాస్త బలహీనమయ్యాయని తెలిపింది. బలపడినప్పుడు కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారి తెలిపారు. సోయాబీన్, పత్తి, చెరకు మరియు పప్పుధాన్యాలు పండించే మధ్య భారతదేశంలో వర్షాల కొరత 29 శాతానికి పెరిగింది. ఈశాన్యంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ, వాయువ్యంలో 68 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.