-Advertisement-

Jaggery: బెల్లం తింటున్నారా.. అయితే ఇప్పుడు ఇది చదవండి..?

Health news health tips Telugu health benefits Telugu health losses Telugu Health and fitness Lifestyle news Jaggery health benefits Jaggery healosses
Pavani

బెల్లం తింటున్నారా.. అయితే ఇప్పుడు ఇది చదవండి..?

Health news health tips Telugu health benefits Telugu health losses Telugu Health and fitness Lifestyle news Jaggery health benefits Jaggery healosses
ఒకప్పటి కాలంలో తీపి అంటే ఎక్కువగా బెల్లాన్నే ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ స్థానంలో చక్కెరను అధికంగా వినియోగిస్తున్నారు. పంచదార వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. భోజనం తర్వాత ఓ చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుంటే అది ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరం ప్రీరాడికల్స్ పై పోరాడేందుకు బెల్లం శక్తినిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనాన్నిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.మెటబాలిజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కేలొరీలను వేగంగా కరిగించడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది.బెల్లం సహజంగా శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపిస్తుంది. అలాగే లివరి ని శుభ్రపరచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. బెల్లంలో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఎనీమియా సమస్య అదుపులోకి రావడంతో పాటు నెలసరి నొప్పులు తగ్గుతాయి. బెల్లాన్ని తరచూ తీసుకుంటే మలబద్ధకం అదుపులోకి వస్తుంది. పేగు కదలికలను వేగవంతం చేస్తుంది. దీంట్లో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తుంది. రిఫైండ్ చేసిన పంచదారలా కాకుండా తక్షణ శక్తిని అందించడంలో బెల్లం ముందుంటుంది. మధుమేహం వస్తుందనే భయమూ ఉండదు.మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉండే బెల్లాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇబ్బంది పెట్టే ఫ్లూ, జలుబు వంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఇందులో ఉండే గ్లైకాలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. తరచూ తీసుకుంటుంటే చర్మం నిగారిస్తుంది.

Comments

-Advertisement-