Lifestyle: నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం మంచిదేనా..!
నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం మంచిదేనా..!
సూర్యోదయ సమయం చాలా విలువైనది. ఆ సమయంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది. ఆ టైంలో పూజలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్నింటిని చూస్తే శుభ ఫలితాలు వస్తాయి. అదృష్టం వరిస్తుంది.
ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరచేతులు చాలా విలువైనవి. హిందూ విశ్వాసాల ప్రకారం.. మన అరచేతుల్లో బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉంటారు. అరచేతి అగ్ర భాగంలో లక్ష్మీ దేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూలంలో గౌరీ దేవి కొలువై ఉంటారని శాస్త్ర వచనం.
ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కావలసిన బుద్ధి నిచ్చే సరస్వతి, శక్తినిచ్చే గౌరీ దేవి, ఆర్థిక పుష్టిని ఇచ్చే గౌరీ దేవికి ఉదయాన్నే నమస్కరించడం వల్ల ఆ రోజు మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.ఉదయం నిద్ర లేవగానే గోమాత దూడకు పాలు ఇవ్వడం లేదా తెల్లని ఆవు పాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీకు శుభఫలితాలు వస్తాయి.
ఉదయం ఎవరైనా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే.. మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని అర్థం.
ఉదయాన్నే నిద్ర లేచే సమయంలో పక్షుల కిలకిలారావాలు, సన్నాయి మేళం, శంఖ నాదం, గుడి గంటల చప్పుడు, వేద మంత్రోచ్ఛారణ, ఆవు మెడలోని చిరు మువ్వల సవ్వడి వింటే ఆ రోజు తప్పకుండా మంచి జరుగుతుంది.
ఉదయం లేవగానే ఇంటి ఇల్లాలు ముంగిట్లో ముగ్గులు పెడుతూ కనిపించినా, తులసి పూజ చేస్తూ కనిపించినా శుభాలు జరగడం ఖాయం.