Loksabha Speaker: లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు.. కాబోయే స్పీకర్ ఎవరు..?
Loksabha Speaker: లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు.. కాబోయే స్పీకర్ ఎవరు..?
Speaker election : కొత్త లోక్‌సభ (Lok Sabha) కొలువుదీరింది. సోమవారం 18వ లోక్‌సభ తొలి సెషన్ మొదలైంది. సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారాలు చేయిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో ఎంపీల ప్రమాణస్వీకారాలు ముగియనున్నాయి.అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే ఎన్డీఏ ఊహించినట్టుగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. అధికార ఎన్డీఏ కూటమి తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఎంపీ కే సురేష్ నామినేషన్ వేశారు. దాంతో దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగబోతున్నాయి. రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. అంతకుముందు ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కాగా లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగుతుండటంతో.. స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్త స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా పాత లోక్‌సభ రద్దుకాగానే ఎంపీల పదవీకాలం ముగిసిపోతుంది. కానీ స్పీకర్ పదవి వెంటనే ఖాళీ కాదు. కొత్త లోక్‌సభ తొలి సెషన్ ప్రారంభం అయ్యేదాకా స్పీకర్ పదవీకాలం కొనసాగుతుంది. ఆ తర్వాతే ఆ పదవి ఖాళీ అవుతుంది.
స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది?
లోక్ సభ (Lok Sabha Elections) స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తెరపడింది. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ ఎన్నికకు మూడోసారి ఓటింగ్ అనివార్యమైంది. కొన్నిసార్లు మినహా దశాబ్దాలుగా స్పీకర్ పదవిని అధికార పక్షం చేపట్టగా.. విపక్షాలు డిప్యూటీ స్పీ పదవి చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్అనివార్యమైంది. కొన్నిసార్లు మినహా దశాబ్దాలుగా స్పీకర్ పదవిని అధికార పక్షం చేపట్టగా.. విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ (Speaker election) 2 2 విషయాన్ని పరిశీలిస్తే..
సీక్రెట్ బ్యాలెట్తోనే ఎన్నిక..
స్పీకర్ ఎన్నిక నిర్వహణకు ఎటువంటి కాల వ్యవధి లేదు. అయితే.. కొత్త లోక్సభ కొలువుదీరిన అనంతరం సాధ్యమైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 93' చెబుతోంది. సాధారణ మెజార్టీతోనే స్పీకర్ ను ఎన్నుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్ గా ఎన్నికవుతారు. లోక్సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా ఈ పదవికి పోటీ పడవచ్చు. ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కేవలం సభలో సభ్యుడు/సభ్యురాలిగా ఉంటే చాలు. సీనియారిటీ, నిష్పాక్షికత వంటి ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను నిలబెడతారు. అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 ప్రకారం, నోటీసులు ఇచ్చిన 14 రోజుల తర్వాతే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?
లోకసభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్దే కీలక పాత్ర. సభను ఆర్డర్లో ఉంచడం, సభా గౌరవాన్ని కాపాడటంతోపాటు సమావేశాల అజెండా, వాయిదా, అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత ఆయనదే. రాజ్యాంగం o 10వ షెడ్యూల్ ప్రకారం సభ నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే, అనర్హత విధించే అధికారం స్పీకర్కు ఉంటుంది. సభా నియమాలను పాటిస్తూనే వాటిని స్పీకర్ అమలుచేయాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయాలను సవాలు చేయలేరు. లోక్సభలో సభ్యుడు/సభ్యురాలు అయినప్పటికీ.. సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.