-Advertisement-

Mega DSC : ఏపీ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్.. నోటిఫికేష‌న్‌ జారీకి ముహూర్తం ఫిక్స్!

AP DSC Notification 2024 PDF Download AP DSC official website Ap dsc full form AP DSC Notification 2024 vacancy details AP Mega DSC apply online 2024
Peoples Motivation

Mega DSC : ఏపీ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్.. నోటిఫికేష‌న్‌ జారీకి ముహూర్తం ఫిక్స్!


రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని స‌ర్కార్‌ యోచన‌..

16,347 టీచ‌ర్‌ పోస్టుల భర్తీకి ఇప్ప‌టికే ప్రభుత్వం ప్రకటన..

ఈ నెల 30న ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుద‌ల‌కు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు..

Ap dsc notification AP DSC Notification 2024 PDF Download AP DSC official website Ap dsc full form AP DSC Notification 2024 vacancy details AP DSC apply online 2024
ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్ర‌భుత్వం కసరత్తు చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని స‌ర్కార్‌ యోచిస్తోంది. గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించలేదు. అందుకే టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు ప్ర‌భుత్వం భావిస్తోంది. 

టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాగా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెల 30న విడుదల కానున్నాయని స‌మాచారం. ఇక డిసెంబర్ 10 నాటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ రూపొందించనున్నార‌ని తెలుస్తోంది.

స్థానికులతోనే ఆయా జిల్లాల్లోని 80 శాతం టీచర్ పోస్టులను భర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇక ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 

ఎస్‌టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు, ఎస్‌సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 భర్తీకానున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ చేయ‌నున్నారు.

Comments

-Advertisement-