-Advertisement-

Milk: రోజు పాలు తాగితే మంచిదేనా..?

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news milk benefits and disadvantages vit
Janu

రోజు పాలు తాగితే మంచిదేనా..?

పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి. అందుకే పలువురు తగినన్ని పాలు తీసుకోవడంలో విఫలమవుతుంటారు.

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news milk benefits and disadvantages

రోజూ పాలు తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం.. క్యాల్షియం మన శరీరానికి చాలా అవసరం. ఎముకలు పటుత్వం కోల్పోకుండా గట్టిగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరిగా ఉండాల్సిందే. పాలల్లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో కూడా క్యాల్షియం ఉన్నా.. మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాలలో ఉన్న క్యా్ల్షియం అయితే త్వరగా ఒంటపడుతోంది. తగినన్ని పాలు తాగితే.. రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతం పొందినట్లే. అంతే కాకుండా పాలలో రోజు వారి పనులకు కావాల్సిన చక్కెర, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. 150 మిల్లీ లీటర్ల పాలలో సుమారు 130 కొలో కేలరీల శక్తి, 4.5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల పిండి పదార్థం, 5 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. బియ్యంలో లేని లైసిన్, త్రియోనైన్, అనే అమైనో ఆమ్లాలనూ పాలతో భర్తీ చేసుకోవచ్చు.

Comments

-Advertisement-