-Advertisement-

MLA Salary: ఎమ్మెల్యేకు జీతం ఎంతో తెలుసా..?

Ap MLA salary per month 2024 MLA salary in AP MLA salary Telangana MLA salary Odisha MLA salary per month in India MLA salary State wise MLA ALLOWANCE
Pavani

MLA Salary: ఎమ్మెల్యేకు జీతం ఎంతో తెలుసా..?

 పీపుల్స్ మోటివేషన్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎమ్మెల్యేలకు ఎంత జీతాల ఇస్తారు..? వీరికి ఉన్న సౌకర్యాలు ఏమిటి..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సౌకర్యాలు, జీతాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతం ఒక్కో విధంగా ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు జీతాలతో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే దేశంలో అందరి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు జీతం ఎంత ఇస్తారో కింది పట్టికలో చూడొచ్చు.

Ap MLA salary per month 2024 MLA salary in AP MLA salary Telangana MLA salary Odisha MLA salary per month in India MLA salary State wise MLA ALLOWANCE
ప్రతి నెల జీతంతోపాటు..

రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ శాసనసభ సభ్యుడు ఉంటారు. ఎమ్మెల్యేను ప్రజలను ఎన్నుకుని శాసనసభకు పంపిస్తారు. అసెంబ్లీలో తన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను దగ్గర ఉండి పరిష్కరిస్తారు. తన నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ పనులన్ని చేసినందుకు ఎమ్మెల్యేకు జీతం ఇస్తుంది. ప్రతి నెల జీతంతోపాటు ప్రత్యేక అలవెన్సులు అందజేస్తుంది. దేశంతో తెలంగాణ కూడా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అత్యధిక జీతం తీసుకుంటున్నార ప్రతి నెల జీతం రూ.2.50 లక్షలు అందుతోంది.ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఎమ్మెల్యేలు అతి తక్కువ జీతం పొందుతారు.

రాష్ట్రాన్ని బట్టి మారుతుంది...

ఎమ్మెల్యేల జీతం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణ తర్వాత అత్యధిక జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవారు. మహారాష్ట్రలో రూ.2.32 లక్షలు, ఢిల్లీలో రూ.2.10 లక్షలు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇస్తోంది. అదే సమయంలో ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ (యూపీ) నాలుగో స్థానంలో ఉంది. యూపీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.1.87 లక్షలు ఇస్తున్నారు. త్రిపుర ఎమ్మెల్యేల జీతం కంటే తెలంగాణ ఎమ్మెల్యేల జీతం 7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఎమ్మెల్యేల వేతనాల విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే వెనుకబడి ఉన్నాయి.

అత్యంత తక్కువగా..

త్రిపురతో పాటు నాగాలాండ్లో రూ.36 వేలు, మణిపూర్లో రూ.37 వేలు, అస్సాంలో రూ.42 వేలు, మిజోరంలో రూ.47 వేలు, అరుణాచల్ ప్రదేశ్లో రూ.49 వేలు ఎమ్మెల్యేలు అందుకుంటున్నారు. జీతంతో పాటు వారు ఉండడానికి ప్రభుత్వం వసతి కల్పిస్తుంది. వైద్య, ప్రయాణ భత్యం కూడా పొందుతారు. దీంతో పాటు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోయిన తరువాత ప్రతినెలా పింఛన్ కూడా ఇస్తున్నారు.

వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాల వివరాలు ఇలా..

రాష్ట్రం         శాసనసభ్యుల జీతం (రూ.లలో)

1. తెలంగాణ            రూ.2.50లక్షలు

2. మహారాష్ట్ర.         రూ. 2.32 లక్షలు

3. ఢిల్లీ.                   రూ. 2.10 లక్షలు

4. ఉత్తర ప్రదేశ్         రూ.1.87లక్షలు

5. జమ్మూ కాశ్మీర్      రూ. 1.60 లక్షలు

6. ఉత్తరాఖండ్         రూ. 1.60 లక్షలు

7. ఆంధ్ర ప్రదేశ్          రూ. 1.30 లక్షలు

8. హిమాచల్ ప్రదేశ్    రూ. 1.25 లక్షలు

9. రాజస్థాన్              రూ. 1.25 లక్షలు

10.గోవా                   రూ. 1.17 లక్షలు

11. హర్యానా           రూ. 1.15 లక్షలు

12. పంజాబ్             రూ. 1.14 లక్షలు

13. పశ్చిమ బెంగాల్   రూ. 1.13 లక్షలు

14. జార్ఖండ్              రూ. 1.11 లక్షలు

15. మధ్యప్రదేశ్        రూ. 1.10 లక్షలు

16. ఛత్తీస్ గఢ్         రూ. 1.10 లక్షలు

17. తమిళనాడు       రూ. 1.05 లక్షలు

18. కర్ణాటక.             రూ. 98 వేలు

19. సిక్కిం.               రూ86.5వేలు

20. కేరళ                  రూ. 70 వేలు

21. గుజరాత్           రూ. 65 వేలు

22. ఒడిషా              రూ. 62 వేలు

23. మేఘాలయ       రూ. 59 వేలు

24. పుదుచ్చేరి         రూ. 50 వేలు

25. అరుణాచల్ ప్రదేశ్. రూ. 49 వేలు

26. మిజోరం              రూ. 47 వేలు

27. అస్సాం               రూ. 42 వేలు

28. మణిపూర్.          రూ. 37 వేలు

29. నాగాలాండ్        రూ. 36 వేలు

30. త్రిపుర               రూ. 34 వేలు


Comments

-Advertisement-