TG Govt: విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల కేటాయింపు..జీవో జారీ చేసిన ప్రభుత్వం..!
TG Govt: విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల కేటాయింపు..జీవో జారీ చేసిన ప్రభుత్వం..!
పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ..
0 - 19 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు..
20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు..
61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు.. అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు ఇవ్వనట్లు సమాచారం..
పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా 0- 19 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గత ప్రభుత్వం 2015, జూన్, 27న జీవో నెం: 17, 2021, ఆగస్టు 21న జీవో నెం: 25 జారీ చేసింది.
విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధనను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయా పాఠశాలలకు పోస్టులకు కేటాయింపు చెయాయనున్నారు. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒకటి, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు రెండు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు మూడు, 61పైన విద్యార్థులున్న పాఠశాలకు ఆ పాఠశాలకు మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు ఇవ్వనట్లు సమాచారం.
ఒక్క విద్యార్థి లేని పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించలేదు అధికారులు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకన్నా ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరితే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపులు జరుగుతాయని అధికారులు తెలిపారు.