Nandyal: బైరెడ్డి శబరి అను నేను..పార్లమెంట్ లో అడుగు పెట్టిన నంద్యాల తొలి మహిళా MP Dr. బైరెడ్డి శబరి
బైరెడ్డి శబరి అను నేను..పార్లమెంట్ లో అడుగు పెట్టిన నంద్యాల తొలి మహిళా MP Dr. బైరెడ్డి శబరి
• పార్లమెంట్ లో ఆ ఈశ్వరుడు సాక్షిగా బైరెడ్డి శబరి తెలుగులో ప్రమాణం చేశారు.
• 72 సంవత్సరాల నంద్యాల లోక్ సభ చరిత్రలో 39 ఏళ్ల వయస్సు లోనే Dr. బైరెడ్డి శబరి నంద్యాల లోక్ సభకు తొలి మహిళా MP గా ఎంపికై చరిత్ర సృష్టించారు..
• 1952 లో నంద్యాల లోక్ సభ ఏర్పడింది..
సోమవారం న్యూ ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో 18 వ లోక్ సభకు ఎన్నికైన MP లతో ప్రొటెం స్వీకర్ భర్త్రు హరి ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల లోక్ సభ నుంచి ఎన్నికైన Dr. బైరెడ్డి శబరి ఆ ఈశ్వరుడు సాక్షిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
దేశ చిత్రపటంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గానికి విశిష్ట స్థానం, ప్రత్యేక గుర్తింపు ఉంది.
భారత రాజ్యాంగంలోనే కీలక పదవులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు చేపట్టి దేశానికి సేవ చేసిన నంద్యాల లోక్ సభ సభ్యులు నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహరావులు.
ఐదు సార్లు నంద్యాల లోక్ సభకు ఎంపికై కేంద్రమంత్రిగా, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్ గా, ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి సిల్వర్ జూబ్లీ పార్లమెంటరియన్ గా గుర్తింపు పొందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల MP గా దేశానికి సేవలందించారు.
బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు, కుటుంబ రాజకీయ నేపథ్యం కర్నూలు, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చెంచు, దళిత కాలనీలలో ఉచిత మెగా వైధ్య శిభిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించి, ఉచితంగా మందులు అందిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేస్తూ నంద్యాల జిల్లా BJP అధ్యక్షురాలుగా పనిచేసారు. ఇటీవల బీజేపీ కి రాజీనామా చేసి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో Dr. బైరెడ్డి శబరి, ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Dr. బైరెడ్డి శబరి సేవా కార్యక్రమాలు, ఆమె రాజకీయ కుటుంబ నేపధ్యాన్ని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయగా తన ప్రత్యర్థి చిట్టింగ్ MP, వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై లక్ష ఓట్లకు పైగా శబరి MP గా విజయం సాధించారు,
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుల సమావేశం నిర్వహించిన టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Dr. బైరెడ్డి శబరిని టీడీపీ లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసి నంద్యాల MP పదవికి ప్రత్యేక స్థానం లోక్ సభలో ఉందని గుర్తు చేశారు.
ఢిల్లీలోని పార్లమెంట్ భవనం లో జరిగే లోక్ సభ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారానికి నంద్యాల MP Dr. బైరెడ్డి శబరి వెళ్లి ప్రమాణం చేయడాన్ని శబరి భర్త Dr. శివచరణ్ రెడ్డి, తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తల్లి బైరెడ్డి భారతమ్మ , చిన్నాన బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, చెల్లెలు బైరెడ్డి శర్వాని లు కనులారా తిలకించి ఆనందపరవశితులయ్యారు.