-Advertisement-

NEET: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్ సలహా కోరిన కేంద్రం..ఏం చేద్దాం చెప్పండి..!

Ugc NEET telugu Ugc neet 2024 UGC NEET city intimation UGC NEET online UGC NEET Answer Key UGC NEET official website UGC NEET Exam Ugc net telugu Ugc.
Priya

NEET: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్ సలహా కోరిన కేంద్రం..ఏం చేద్దాం చెప్పండి..!

నీట్ వ్యవహారంలో తల్లిదండ్రుల సలహా కోరిన కేంద్రం..

ఎన్టీఏ సంస్కరణకు కేంద్రం పిలుపు..

పార్లమెంట్లో చర్చను లేవనెత్తిన ప్రతిపక్షం..

నీట్, యూజీసీ-నెట్ పరీక్షా పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పారదర్శకతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ పనితీరు, పారదర్శకతపై కేంద్రం ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్, నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. 

Ugc NEET telugu Ugc neet 2024 UGC NEET city intimation UGC NEET online UGC NEET Answer Key UGC NEET official website UGC NEET Exam Ugc net telugu Ugc

వెబ్సైట్

https://innovateindia.mygov.in/examination- reforms-nta/ ద్వారా సూచనలను సలహాలను స్వీకరించనుంది. జూలై 07 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

ఇటీవల నీట్, యూజీసీ - నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ నెట్ పేపర్ డార్వెబ్లో ప్రత్యక్షం కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అవకతవకలపై నిరసన తెలియజేస్తోంది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నీట్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రధాన సూత్రధారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

-Advertisement-