-Advertisement-

Railways: రైల్వేలో బ్యాగు చోరీ.. రైల్వేకి రూ.లక్ష జరిమానా

Telugu daily news intresting news daily telugu news breaking news breaking news Telugu daily political news updates latest crime news Telugu ssc jobs.
Priya

Railways:రైల్వేలో బ్యాగు చోరీ.. రైల్వేకి రూ.లక్ష జరిమానా

సేవల్లో నిర్లక్ష్యం, లోపాలు ఉన్నాయని పేర్కొంటూ భారతీయ రైల్వేకు ఓ జిల్లా వినియోగదారుల కమిషన్ రూ. లక్ష జరిమానా విధించింది.

Telugu daily news intresting news daily telugu news breaking news breaking news Telugu daily political news updates latest crime news Telugu ssc jobs.

దిల్లీ: రైల్వే ప్రయాణికురాలి లగేజీ చోరీకి సంబంధించి ఓ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సేవల్లో నిర్లక్ష్యం, లోపాలు ఉన్నాయని భారతీయ రైల్వే (Indian Railways)కు రూ. లక్ష జరిమానా విధించింది. లగేజీ కోల్పోయిన బాధితురాలికి మొత్తం రూ.1.08 లక్షలు చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్ను ఆదేశించింది.

దిల్లీకి చెందిన ఓ ప్రయాణికురాలు 2016 జనవరిలో మాల్వా ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. ఈ క్రమంలో ఝాన్సీ నుంచి గ్వాలియర్ స్టేషన్ల మధ్య ఆమె బ్యాగు చోరీకి గురయ్యింది. అందులో రూ.80వేల విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు ప్రయాణికులు, వారి వస్తువుల భద్రత కూడా రైల్వేదేనని ఆమె వాదించింది.

ఈ పిటిషన్ ను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ విచారించింది. ఫిర్యాదుదారు ఢిల్లీలో రైలు ఎక్కినందున.. ఇందౌర్కు చేరే వరకు అది తమ పరిధిలోకే వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా జనరల్ మేనేజర్ ఉన్న ప్రదేశం కూడా తమ పరిధిలోనిదే అని చెప్పింది. లగేజీ కోల్పోయింది మొదలు ఎఫ్ఎఆర్ నమోదు వరకు అనేక చోట్ల తిరగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల తీరుతో ఆమె అనేక ఇబ్బందులు పడ్డారని, చట్టపరమైన హక్కుల కోసం అనేక వేధింపులకు గురయ్యారని అభిప్రాయపడింది.

ప్రయాణికురాలు తన వస్తువుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్ చేసుకోలేదని రైల్వేశాఖ చేసిన వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఈ విషయంలో భారతీయ రైల్వే నిర్లక్ష్యం, సేవాలోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు కోల్పోయిన వస్తువుల విలువ రూ.80వేలను తిరిగి పొందేందుకు అర్హురాలని పేర్కొంది. దీంతోపాటు ఆమెకు కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారంగా రూ. 20వేలు, న్యాయప్రక్రియ ఖర్చుల కింద మరో రూ.8వేలు చెల్లించాలని ఆదేశించింది.

Comments

-Advertisement-