Ration Card: ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయని వారికి మరో అవకాశం
Ration Card: ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయని వారికి మరో అవకాశం
ఈ నెల 30తో ముగియనున్న గడువు
మరో మూడు నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్రం
డిల్లీ (పీపుల్స్ మోటివేషన్)
ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. ఈ రెండూ లింక్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువును మరో మూడు నెలలు పొడిగించింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది.
ఈ రెండింటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు.