-Advertisement-

Renu Desai: నన్ను అలా పిలవ వద్ధు.. ఎంతో బాధగా ఉంటుంది: రేణూ దేశాయ్

Renu Desai tweet Telugu daily news Intresting news Health news Health tips Useful news Educational News Job news Latest Telugu news Telugu short news
Peoples Motivation

Renu Desai: నన్ను అలా పిలవ వద్ధు.. ఎంతో బాధగా ఉంటుంది: రేణూ దేశాయ్

  • పవన్ తో రేణూ దేశాయ్ విడాకులు
  • సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోలింగ్
  • ఇలాంటివి విని అలసిపోయానన్న రేణూ దేశాయ్
  • ఇది 2024... ఇకనైనా మారదాం అంటూ పిలుపు
  • ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టు

Renu Desai tweet
పవన్ కల్యాణ్ తో వైవాహిక బంధం విచ్ఛిన్నమైనప్పటి నుంచి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితురాలిగా ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు విమర్శకులను ఖండిస్తూనే ఉంటారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 

"కొంతమంది నన్ను దురదృష్టవంతురాలు అంటారు. నన్ను అలా పిలుస్తున్నందుకు ఎంతో బాధగా ఉంటుంది. ఇలాంటివి ఏళ్ల తరబడి వింటూ అలసిపోయాను. కేవలం నా భర్త నన్ను విడిచి వెళ్లిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు ఇలాంటి మాటలు పడాల్సి వస్తోంది. 

ఇది 2024. ఇకనైనా మనం మారదాం. విడాకులకు, అదృష్టానికి ముడిపెట్టడం ఇకనైనా మానేద్దాం. అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి... వారి వ్యక్తిత్వాన్ని, వారి ప్రతిభను, వారి కృషిని గుర్తించడం ప్రారంభిద్దాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం... ఒక ఆలోచనపై నిలకడగా ఉండడం నేర్చుకుందాం" అంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు.

Comments

-Advertisement-