-Advertisement-

Side Effects of Salts: ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నారా..? ఆ సమస్యలతో జాగ్రత్త..!

Disadvantages of using excess of salt helath news telugu Helath tips telugu life style benefits losses uses advantages and disadvantages side effects
Priya

Side Effects of Salts: ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నారా..? ఆ సమస్యలతో జాగ్రత్త..!

వంటల్లో అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అని ఉప్పు అంటుందంట. ఎందుకంటే ఏ వంటల్లోనైనా ఉప్పు ఎక్కువైనా.. తక్కువైనా తినాలంటే అంతగా రుచి ఉండదు. అయితే కొంతమంది కూరల్లో ఉప్పు తక్కువైందని రుచి కోసం ఎక్కువగా వేసుకుంటారు. ఇలా ప్రతీ రోజూ అధిక మొత్తంలో తినడం ద్వారా అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో రక్తపోటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువ తినడంతో అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

Disadvantages of using excess of salt helath news telugu Helath tips telugu life style benefits losses uses advantages and disadvantages side effects

ఉప్పు..ప్రతీ ఒకరి ఇళ్లల్లో నిత్యావసర వస్తువు. అయితే ఉప్పు తక్కువ మోతాదులో వాడితే ఎలాంటి సమస్యలు ఉండవు. రోజూ తీసుకునే మోతాదు కంటే పెరిగితే సమస్యలు రావొచ్చు. అలా అని ఉప్పు మానేయడం కూడా ప్రమాదమే. ఒకరోజుకు ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలను ఉప్పు వేసి కడగడంతో అందులో ఉండే క్రిములు నశించే అవకాశం ఉంటుంది. శరీరానికి ఉప్పు సోడియం అందిస్తుంది. ఇందులోని సోడియం నరాల ప్రేరణ, రక్తప్రసరణ, కండరాల సంకోచం, ఖనిజాల సమతుల్యతను కాపాడుటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఉప్పును అధిక మొత్తంలో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులతోపాటు అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, లివర్ వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ సమస్యలు ఎక్కువగా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వాపు, దాహం ఎక్కువగా వేయడం, నిద్రలేమి సమస్యలు, నీరసం ఏర్పడడం, మూత్ర విసర్జన, జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఎంత మోతాదు తీసుకోవాలంటే?

ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకూ 2 నుంచి 5 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫారసు చేస్తుంది. ఇంతకంటే అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో కరిగిపోవడానికి ఎక్కువ నీరు అవసరం కానుంది. దీంతో డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంది. అందుకే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే దాహం వేసి నీరు అధికంగా తీసుకుంటారు. దీంతో పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే అధిక సోడియంను కరిగించడానికి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. రక్తంలో ధమనుల ఒత్తిడి పెరుగుతుంది.

జాగ్రత్తలు అవసరం

వంటల్లో జాగ్రత్తగా ఉప్పు వాడాలని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు సాస్‌లు, నిల్వ పచ్చళ్లలో అధిక మోతాదులో ఉప్పు ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి. బయట పదార్థాలు తీసుకోవడం తగ్గించాలని, పెరుగు, సలాడ్స్, పండ్లలో ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తీసుకోవడం మంచిది. ఆహారంలో ఉప్పు ఎక్కువ కాకుండా.. మరీ తక్కువ కాకుండా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనంగా ఉంటుంది. లేదంటే శరీరంలో కలిగే మార్పులతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Comments

-Advertisement-