-Advertisement-

TG Govt: త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం..

Tspsc telugu Tspsc results TSPSC Group 4 www.tspsc.gov.in results TSPSC login TSPSC Departmental Test TSPSC Departmental Test apply online TSPSC ID
Pavani

TG Govt: త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం..

ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ యువత ధర్నా..

గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ విద్యార్థుల ధర్నాపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నిరుద్యోగ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద నిరసన చేబట్టారు. విద్యార్థుల ధర్నాపై మంత్రి స్పందిస్తూ, త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల ఖాళీలను గుర్తించి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చెప్పిన మాటలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

Tspsc telugu Tspsc results TSPSC Group 4 www.tspsc.gov.in results TSPSC login TSPSC Departmental Test TSPSC Departmental Test apply online TSPSC ID

కొందరు విద్యార్థులు, నిరుద్యోగ మిత్రులు ఈరోజు ధర్నా చేస్తున్నట్లుగా తనకు తెలిసిందని శ్రీధర్ బాబు అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. జీవో 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-