UGC NET- 2024: పేపర్ లీక్ చేసిన దోషుల్ని వదిలేది లేదు “హై-లెవల్ కమిటీ ఏర్పాటు".. లీక్లపై కేంద్రమంత్రి స్పందన
Ugc net telugu
Ugc net 2024
UGC NET city intimation
UGC NET online
UGC NET Answer Key
UGC NET official website
UGC NET exam date 2024
UGC NET 2024 off
By
Pavani
UGC NET- 2024: పేపర్ లీక్ చేసిన దోషుల్ని వదిలేది లేదు “హై-లెవల్ కమిటీ ఏర్పాటు".. లీక్లపై కేంద్రమంత్రి స్పందన
నీట్ యూజీసీ-నెట్పై స్పందించిన కేంద్రం..
హై లెవల్ కమిటీ ఏర్పాటు..
దోషుల్ని వదిలేది లేదు..
విద్యార్థుల కెరీర్ని తాకట్టు పెట్టలేం..
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పరీక్షలకు 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత నీట్ అవకతవకలు, యూజీసీ- నెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై ఈ రోజు నిరసనలు తెలిపింది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ యూత్ వింగ్ ఆందోళన నిర్వహించిన తర్వాత కేంద్రమంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. “విద్యార్థుల ప్రయోజనాలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను హామీ ఇస్తున్నాను. పారదర్శకతలో రాజీపడము. నీట్ పరీక్షకు సంబంధించినంతవరకు మేము బీహార్ ప్రభుత్వంతో టచ్లో ఉన్నాము. ప్రాథమిక సమచారం ప్రకారం పాట్నా పోలీసులు మాకు వివరణాత్మక నివేదిక పంపుతారు. అవకతవకలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.” అని అన్నారు.
Comments