UGC-NEET 2024: నీట్ పేపర్ లీక్.. క్వశ్చన్ పేపర్ బయట పెట్టిన స్టూడెంట్..!
UGC-NEET 2024: నీట్ క్వశ్చన్ పేపర్ లీక్.. బయట పెట్టిన స్టూడెంట్..!
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన యూజీసీ- నీట్ 2024 క్వశ్చప్ పేపర్ లీక్..
లీకైన క్వశ్చన్ పేపర్ ను పోలీసులకు అప్పగించిన అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి..
ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన నెట్ పరిక్షను రద్దు చేసిన ఎన్టీఏ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూజీసీ- నీట్ 2024 పరిక్షల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో బీహార్ కు సంబంధించిన అవుట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ప్రశ్న పత్రాలు పొందినట్లు నిర్ధారించారు. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీహార్ కు చెందిన అనురాగ్ యాదవ్ అనే స్టూడెంట్ ని పోలీసులు ఎంక్వైరీ చేయగా.. అతను ముందస్తుగానే లీకైన పేపర్ను పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ పేపర్ ఒరిజినల్ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సేమ్ టూ సేమ్ ఉన్నాయి.
అయితే, ఈ యూజీసీ- నీట్ 2024 క్వశ్చన్ పేపర్ ను జూనియర్ ఇంజనీర్ అయిన తన అంకుల్ పరీక్షకు ముందు ఇవ్వడంతో దానికి తగ్గట్టుగా రాత్రికి రాత్రే ప్రిపేర్ అయ్యానని నిందితుడైన అనురాగ్ యాదవ్ నేరాన్నీ అంగీకార పత్రంలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వివాదం ఇటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) కు తాకింది. దీంతో ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన నెట్ పరిక్షను రద్దు చేస్తున్నట్లు బుధవారం రాత్రి ఎన్టీఏ వెల్లడించింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కొనసాగుతుంది.