-Advertisement-

IIT Bombay: విద్యార్థుల‌కు జ‌రిమానా విధించిన ఐఐటీ బాంబే.. కార‌ణం ఇదే..!!

UGC NET NTA UGC NET UGC NET 2024 UGC EXAM DATES UGC EXAM CANCELD NTA NEET EXAM NTA NEET MASS COPYING NEWS UGC LOGIN NTA LOGIN NTA.ac.in UGC official
Priya

IIT Bombay: విద్యార్థుల‌కు జ‌రిమానా విధించిన ఐఐటీ బాంబే.. కార‌ణం ఇదే..!!

రామాయణం నాట‌కం తెచ్చిన తంటా

రామాయణం ఆధారంగా 'రాహోవన్' నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు  

అందులో రాముడు, సీత పాత్ర‌ల‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన‌ట్లు ఓ వ‌ర్గ విద్యార్థుల ఫిర్యాదు

దీంతో ఎనిమిది మంది విద్యార్థుల‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఐఐటీ అధికారులు

UGC NET NTA UGC NET UGC NET 2024 UGC EXAM DATES UGC EXAM CANCELD NTA NEET EXAM NTA NEET MASS COPYING NEWS UGC LOGIN NTA LOGIN NTA.ac.in UGC official

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఇటీవల నిర్వహించిన రామాయణం నాటకాన్ని కించపరిచారని పలువురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది విద్యార్థులకు జ‌రిమానా విధించారు. వీరిలో న‌లుగురికి రూ. 1.20 లక్షల చొప్పున‌ జరిమానా విధించ‌గా, జూనియ‌ర్లు అయిన మ‌రో న‌లుగురికి రూ. 40వేల చొప్పున ఫైన్ వేశారు. అలాగే న‌లుగురు జూనియ‌ర్ విద్యార్థులు వెంట‌నే క్యాంప‌స్ ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. 

వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీ బాంబేలో మార్చి 31న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో రామాయణం ఆధారంగా 'రాహోవన్' నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో స్త్రీవాద సమస్యల పేరుతో రాముడి పాత్రను తారుమారు చేసి పాత్రల పేర్లలో మార్పులు చేశారు. వేదికపై దేవుడిని ఎగతాళి చేస్తూ డైలాగ్స్ చెప్పారు. దీంతో ఈ నాటకాన్ని ఓ వర్గం విద్యార్థులు వ్యతిరేకించారు. ఇది హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉందని ఆరోపించారు. రాముడు, సీత పాత్ర‌ల‌ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన‌ట్లు పేర్కొన్నారు.

దీంతో ఐఐటీ సిబ్బంది స్పందించి ఈ నాటకంలో పాల్గొన్న ఓ విద్యార్థులు జరిమానా చెల్లించాలంటూ ఈ నెల 4న నోటీసు ఇచ్చింది. 1.20 లక్షల జరిమానాను జులై 20, 2024న డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని నోటీసులో పేర్కొన‌డం జ‌రిగింది. అంతకుముందు ఈ డ్రామాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మే 8న క్రమశిక్షణా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో విద్యార్థులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత శిక్షను నిర్ణయించారు.

అంతేకాదు శిక్షను ఉల్లంఘిస్తే మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొంద‌రు ఓ విద్యార్థికి ఒక సెమిస్టర్‌ ఫీజుతో సమానమైన జరిమానా విధించడం పట్ల విమర్శ‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అలా దేవుడి పాత్రలను కించపరచడం సరికాదని అంటున్నారు. 



Comments

-Advertisement-