UGC NET-2024: యుజీసీ నెట్ లీక్ పై ఎస్ఐఆర్ నమోదు..సీబీఐ విచారణ
UGC NET-2024: యుజీసీ నెట్ లీక్ పై ఎస్ఐఆర్ నమోదు..సీబీఐ విచారణ
యూజీసీ-నెట్ వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఎఆర్..
డార్వెబ్లో పేపర్ లీక్ అయినట్లు కేంద్రం వెల్లడి..
హై లెవల్ కమిటీ ఏర్పాట్లు చేస్తామన్న కేంద్రమంత్రి..
యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డార్వెబ్ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎస్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పనితీరుపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు మాట్లాడుతూ.. ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్వెబ్లో యూజీసీ- నెట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆయన వెల్లడించారు. జూన్ 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహించగా, రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విద్యార్థులు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజే పేపర్ లేకేజ్ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షను రద్దు చేశారు.