Vegetables: మండుతున్న టమాటో ధరలు.. కిలో 80 రూపాయలు
Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs daily Telugu news
By
Pavani
Vegetables: మండుతున్న టమాటో ధరలు.. కిలో 80 రూపాయలు
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది.మదనపల్లె గ్రామీణ: మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్ సందర్భంగా మార్కెట్కు రైతులు తక్కువ సరకును తీసుకొచ్చారు. గత వారం రోజులుగా ఇక్కడ ధర అత్యల్పంగా కిలో రూ.41 నుంచి అత్యధికంగా రూ.64 ఉంది.
సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో రూ.69 నుంచి రూ.80 వరకు, బీ గ్రేడ్ రూ.50 నుంచి రూ.68 వరకు ధర పలికింది.ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరకు తగ్గడంతో పాటు, దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరకు మార్కెట్కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్కు రోజూ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరకును రైతులు తీసుకొస్తున్నారు. సోమవారం బక్రీద్ కావడంతో మార్కెట్కు ఎగుమతికి అవసరమైన దాని కంటే తక్కువగా వచ్చింది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నులు టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు. దీంతో కిలో ధర రూ.80కి చేరుకుంది. రైతుల నుంచి వ్యాపారులు సగటున 25 కిలోల బుట్ట ధర రూ.1600 నుంచి రూ.1900కు కొనుగోలు చేసి బయటి మార్కెట్లకు ఎగుమతి చేశారు.హైదరాబాద్‌లో...
హైదరాబాద్‌లో సైతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ నాణ్యమైన మొదటి రకం టమాటా కిలో రూ. 80 నుంచి రూ. 90 పలుకుతోంది. సెకండ్ క్వాలిటీ టమాటా కిలో ధర రూ. 60 నుంచి 70 ఉంది. హోల్ సేల్ మార్కెట్లలో రూ. 120కి మూడు కిలోల టమాట విక్రయిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ధరలు ఇంకా అదుపులోనే ఉన్నాయి. జులై నుంచి అక్టోబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కిలో టమాట రూ.100కూడా దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో టమాటలను సబ్సిడీపై అందించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.
Comments