AP DSC: టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!
AP DSC: టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!
మెగా డీఎస్సీకి సమయం కోరుతూ అభ్యర్థుల నుంచి వినతులు
స్పందించి... విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్
పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయం
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తితో పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు టెట్ పరీక్షకు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజుల సమయం ఇచ్చింది. సమయం కోరుతూ అభ్యర్థుల నుంచి అత్యధిక వినతులు రావడంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
విద్యాశాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇవ్వనుంది.