-Advertisement-

APPSC Group 2 Mains: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన

Group 2 telugu Group 2 inter Group 2 Notification Group 2 Syllabus APPSC Group 2 APPSC Group 2 Notification APPSC Group 2 Notification 2024 APPSC Grou
Priya

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఏప్రిల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా.. మెయిన్స్కు 92 వేల మందికి పైగా క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

మరోవైపు, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సిలబస్లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థనల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న వేళ ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

Comments

-Advertisement-