AP TET 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ.. పూర్తి వివరాలు
AP TET 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ.. పూర్తి వివరాలు
ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్‌ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.inలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్‌ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలుకానున్నది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను కింది వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. పరీక్ష కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఆగస్టులో టెట్ నిర్వహించే ఉండగా.. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీకి త్వరలో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నది. వివిధ కేటగిరీల కింద 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇటీవల కేబినెట్ సైతం మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.