Biggboss 8: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్..! సీజన్ మొదలు అప్పుడేనా..?
Biggboss 8: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్..! సీజన్ మొదలు అప్పుడేనా..?
బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్ రియాలిటీ కాన్సెప్టుతో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అలాగే.. సీజన్ మొదలు అయ్యేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారో.. ఫైనల్ ఎపిసోడ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అంటూ నిరాశ వ్యక్తం చేస్తుంటారు. మళ్లీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్లు కాయలు కాసే వరకు ఎదురు చూస్తుంటారు. ఆ రేంజ్లో బిగ్ బాస్ షోకు అభిమానులు ఉండడంతో బుల్లితెర పై బిగ్గెస్ట్ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతుంది.
అంతేకాకుండా దేశంలో ఉన్న పలు భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. అయితే, అన్నింటి కంటే తెలుగులోనే ఇది ఎక్కువగా రెస్పాన్స్ అందుకుని సత్తా చాటుతోంది. చాలా రికార్డులను సైతం క్రియేట్ చేసి తెలుగు షో సెన్సేషన్ అయిపోయింది. సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న బిగ్బాస్ ఆడియన్స్కు శుభవార్త అందింది. తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 8కు రెడీ అయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వచ్చే నెల 4 లేదా 11వ తేదీల్లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అలాగే అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తుల వివరాలకు సంబంధించిన ఓ లిస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రాసెస్ ఇప్పటికే మొదలు అయినట్లు తెలుస్తోంది. సీజన్ 8 బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం మేరకు.. బిగ్ కంటెస్టెంట్గా 'బర్రెలక్క, హేమ, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి, హీరోరాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ' పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా.. అనుహ్యంగా పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.