Pensions: వాలంటీర్ల ప్రమేయం లేకుండానే ప్రతి గడపకు పెంచిన పెన్షన్ల పంపిణీ..
Pensions: వాలంటీర్ల ప్రమేయం లేకుండానే ప్రతి గడపకు పెంచిన పెన్షన్ల పంపిణీ..
సచివాలయం సిబ్బంది ఉద్యోగుల ద్వారా ప్రజల సంక్షేమం పునరావృతం,పారదర్శకతకు పెద్ద పీట... కొట్టె మల్లికార్జున బిజెపి యువ నాయకులు
డోన్, జులై 01 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేసిందని పేర్కొనవచ్చు. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియా తో మాట్లాడుతూ గత మూడు నెలలుగా మంజూరు అయిన పెన్షన్లు అర్హులకు పంపిణీ చేయడంలో తలెత్తిన ఇబ్బందులను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందనీ నిరూపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు మరియు ప్రభుత్వ సచివాలయం అధికార్లతో కలిసి ప్రతి ఒక్కరూ సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వెళ్లి హామీ ఇచ్చిన పెన్షన్లతో పాటు, గత మూడు నెలలకు పెంచిన నగదు తో కలిపి పంపిణీ చేశారు మొత్తం మీదుగా ఏకకాలంలో పెన్షన్లు 3000 నుండి 4000 కి మరియు దివ్యాంగులకు 6000 , పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వికలాంగులకు 15000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు 10000 చొప్పున పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయిపోయినప్పటికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్ళల్లో నుండి వచ్చినా ఆనందం మాటల్లో చెప్పలేనిది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తుందని ఆశా భావాన్ని బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున వ్యక్తం చేశారు.