తల్లిదండ్రులు లేని విద్యార్థులు కస్తూర్బా లో చదువుకోవడానికి అర్హత లేదా..
తల్లిదండ్రులు లేని విద్యార్థులు కస్తూర్బా లో చదువుకోవడానికి అర్హత లేదా..
- కస్తూర్బా లో అడ్మిషన్ పొందాలంటే రాజకీయ నాయకుల అనుమతి కావాలా..
- అంత ఆన్లైన్ అంటూ తల్లితండ్రులు లేని విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రిన్సిపల్
- రాజకీయ నాయకులు చెప్పిన వారికే ప్రిన్సిపల్ సీట్లు ఇస్తున్నారా..
- అసలైన నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి..
- నిరుపేద విద్యార్థినిలు రోడ్డున పడాల్సిందేనా..
దేవనకొండ, జూన్ 30
(పీపుల్స్ మోటివేషన్):-
తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒంటరిగా ఉన్న పిల్లలు, బడి బయట పిల్లలకు విద్యను అందించడానికి భారత ప్రభుత్వం యొక్క 60:40 ఆర్థిక సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రధాన విద్యా సంస్థల్లో కస్తూర్బా పాఠశాల ఒకటి.ప్రధానంగా అన్ని విద్యాపరంగా వెనుకబడిన బ్లాకులలో ప్రాథమిక స్థాయి వరకు విద్యను అందించడానికి బాలికల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకాన్ని 2004-05 విద్యా సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది.
అయితే దేవనకొండ మండలంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో అసలైన నిరుపేద విద్యార్థినిలకు సీట్ల కేటాయించకపోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అర్హత లేని విధంగా ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కొందరు రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించినందున ప్రిన్సిపాల్ కొందరికి సీట్లు కేటాయించిందని తల్లిదండ్రులు మనోవేదన తో బాధపడుతున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా లో అసలైన అర్హులైన పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే సీట్ల కేటాయించడం అన్యాయం అన్నారు.కేవలం రాజకీయ పలుకుబడి మరియు కస్తూర్బా పాఠశాలలో పనిచేసే అధ్యాపకుల బంధువులు విద్యార్థులకు,వారికి తెలిసిన విద్యార్థులకు సీట్లు ఇవ్వడం అన్యాయమన్నారు.జిల్లాలోని
అత్యంత వెనుకబడిన, అనునిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతం దేవనకొండ మండలం అందులో ఎక్కువగా వలసలు వెళ్లే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది దేవనకొండ మండలమే.ఇక్కడి ప్రజలు బ్రతకడానికి బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, కడప వంటి ప్రాంతాలకు వలసలు వెళుతుంటారు. మండల ప్రజలు బడికి వెళ్లే పిల్లలను కూడా వెంటబెట్టుకొని వెళతారు. వలసలు వెళ్లే వారిలో కొంతమంది బాలికల విద్యార్థుల తల్లిదండ్రులు కస్తూర్బా స్కూల్లో విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఆ తల్లిదండ్రుల ప్రయత్నం ఫలించడం లేదు. ఈ పాఠశాలలో ఒక్కో తరగతికి సంబంధించి 40 విద్యార్ధినీలు మాత్రమే ఉండాలని రాష్ట్రస్థాయి అధికారులు చెప్పడంతో, ఒక్క విద్యార్థినిని కూడా ఎక్కువ చేర్పించుకోమని, మా చేతుల్లో ఏమీ లేదని, విజయవాడ నుండే సెలెక్ట్ లిస్టు వచ్చిందని కస్తూర్బా ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాలల చుట్టూ, కర్నూలు కస్తూర్బా జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మా పిల్లలను స్కూల్లో చేర్పించుకోవాలని, చదువుక నేందుకు అవకాశం కల్పించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆన్లైన్ లో వీరికి ఇష్టం వచ్చిన వారికే పాఠశాలలో సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు చదువుకోవటానికి సీట్లు ఇవ్వకపోతే విద్యార్థులు చదువుకు దూరమై రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.