AP TET NOTIFICATION: ఏపీ టెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం.. ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ చూడండి?
AP TET NOTIFICATION: ఏపీ టెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం.. ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ చూడండి?
• నేడే ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల
• జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు (జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి. వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించనుంది. ఏపీ టెట్(జులై)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం https://cse.ap.gov.in/ వెబ్ సైట్లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్ వివరాలన్నీ వెబ్ సైట్లో పెట్టామన్నారు. పరీక్షలు ఆన్లైన్ విధానంలో (CBT) జరుగుతాయన్నారు.
టెట్లో అర్హత సాధిస్తేనే..
మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే.. టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజి ఉండటంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.