మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు
మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు
- చిన్నపిల్లల నుండి వృద్ధులు వరకు వదలని కామాంధులు
- పసి మొగ్గలపై పశువాంఛ.. అభం శుభం తెలియని బాలికలే లక్ష్యం
- ఒకరిని హత్య చేసే హక్కు ఎవరు ఇచ్చారు
ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం అని ఎలుగెత్తిన మహానుభావుడే బతికొస్తే, అర్ధరాత్రి కాదు కదా మిట్ట మధ్యాహ్నం కూడా తిరగలేని నేటి దుస్థితిని చూసి గుండె చెరువైపోతాడు. నీడే పామై కరిచినట్లుగా నమ్ముకున్న వాళ్ళే తోడేళ్లైన సంఘటనలు అడుగడుగునా మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఆప్యాయత కుమ్మరిస్తూ తాకే ఆ చేతుల వెనుకున్నది ఆత్మీయతో లేక అవకాశం కోసం ఎదురుచూస్తున్న మృగత్వమో తరచి తరచి నిర్ణయించుకోవలసిన దుస్థితి ఆడపిల్లలకు దాపురించడం మహోన్నత సంస్కృతి మాది అని చెప్పుకునే భారతీయ సమాజానికి సిగ్గుచేటు. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారుల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరుసలు మరచిన కామాంధులు దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. భూమి మీద మహిళ లేకపోతే సృష్టికి మనుగడే లేదు. తల్లి కడుపులో పడిన నాటి నుంచి కట్టె కాలే వరకు మహిళ తన ఒళ్లు గుల్ల చేసుకొని చేసే సేవకు, శ్రమకు, త్యాగానికి ఈ సమాజం ఏమిచ్చినా రుణం తీరదు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆడపిల్లలకు మాత్రం కనీస రక్షణ కరువైంది. మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి 'బురదలో పోసిన పన్నీరు చందంగానే' మారుతున్నాయి. అబంశుభం తెలియని పసిమొగ్గలకు
చాక్లెట్లు ఆశచూపి కన్నుమిన్నుగానక తనను కనిపెంచింది ఒక ఆడదే నని మరిచి పశువుల్లా మీదపడి గోళ్ళతో రక్కి రక్కి పంటితో కొరికి కొరికి బాధలకు తాళలేక పసిపిల్ల ఏడుస్తుంటే పైశాచిక ఆనందం పొందుతూ లేడిపిల్ల మాంసాన్ని తినే అడవి జంతువుల కంటే హీనంగా, ఘోరంగా బండకేసి మోదుతూ, పచ్చినెత్తురు తాగే మృఘాల కంటే కూడా నీచంగా చేతులు జోడించి ప్రాదేయపడ్డా కనికరం చూపలేని కఠినాత్ములు
ప్రాణం పోయినా కామంతో శవాన్ని పీక్కుతినే రాబందులుల్లా కోరిక తీర్చుకునే మానవ మృఘాలను శిక్షించేది ఎవరు?
ఏమవుతుందో తెలియని పసిప్రాయాలను దోచుకున్న ఈ కఠినమృఘాలను ఆపేదెవ్వరు?
పసిమొగ్గలు కరుడుగట్టిన మృఘాల చేతుల్లో రాలిపోతుంటే కన్న కడుపు ఘోష వినేదెవ్వరు?
భూమాత ఈ పాపాత్ముల భారానికి బద్దలైపోతుంది ఇటువంటి మృఘాల వల్ల
ఆడపిల్లను కనాలంటే భయం పెంచాలంటే భయం
బయటకు పంపాలన్నా భయం పెంచి పెద్దచేసి కంటికి రెప్పలా కాపాడుకుని పెండ్లి చేసి పంపినా వరకట్నం కోసం హింసలు తప్పకపాయె
భయం గుప్పిట్లో ఆడపిల్లల జీవితం ఇంకెనాళ్ళీ ఈ భయం ఎటువెళ్తుందీ సమాజం
ఎన్ని చట్టాలొచ్చినా మానవ నైజం మారేనా
భగవంతుడు మరో అవతారం ఎత్తినా ఈ మానవమృఘాలను శిక్షించేనా ఇకనైనా మేలుకోండి యువతీయువకులారా షడ్గుణాలను వదిలిపెట్టండి ఆడపిల్లలను కాపాడుదాం
భయం అనేది లేకుండా చేద్దాం. ఆడపిల్లకు అన్యాయం... అలనాటి నుండీ జరుగుతుందే....
ఈనాడు ఇదేం కొత్తకాదు...సంవత్సరానికి సగటున వేలాది అకృత్యాలు జరుగుతున్నా...
లక్షలాది ఆడతల్లులు.... ఆహకారాలు చేస్తున్నా.... నిర్భయలాంటి చట్టాలు ఎన్నున్నా...
కఠినాదికఠినంగా శిక్షలేసినా....ఈ అకృత్యాలను ఆపలేకపోతున్నాయి... పట్నం... పల్లె తేడాలేదు...
చదువు సందె బేదం లేదు...వయో బేదం అసలేలేదు పరువు మర్యాద కానరాదు...
ఆడతనం కనిపిస్తే చాలు...ఒళ్ళంతా కామనేత్రాలే అవుతున్నాయి...కర్కషత్వంతో కామ క్రీడ లో తేలుతున్నాయి.... బడికి వెళ్ళాలంటే భయం
బాయికాడికి నడవాలంటే భయం...మార్కెట్ కు వెళ్ళాలంటే భయం...షాపింగ్ చేయాలంటే భయం...సినిమాకు పోవాలంటే భయం...
కారణం... తల్లీ... చెల్లీ...తేడాతెలియని పోకిరీలతో భయం...మార్పు ఎక్కడో మొదలవ్వదు...
మన ఇంటినుండే మొదలవుతుంది..ముందు నువ్వు మారాలి...నీ పిల్లలకు బుద్దులు నేర్పాలి..
స్త్రీని గౌరవించడం... మననుండే...మన ఇంటినుండే మొదలవ్వాలి...అప్పుడే స్త్రీ నిజమైన స్వేఛ్చ వాయువును పీల్చగలదు...లేదంటే...
ఆడదే తిరగబడితే రక్తచరిత్రలే....మగవాడనే మాట వనిడం తప్ప...జాతిని చూడలేము... పక్కా...అందుకే ఆడది ఆదిశక్తి గా మారకముందే...మగమృగాలు మారాలి...
ఇకనైనా మారండి...మీ అమ్మ, అక్క, చెల్లి, కూతురు...ఆడదని మరవకండి... ఆడతల్లిని బ్రతికించండి. నిన్న కాక మొన్న 60 సంవత్సరాల వృద్ధురాలు మీద కొంతమంది కామ పిచాచులు కాటేశారు అదే కాకుండా వరకట్నం వేధింపులు ఇలా సమాజంలో మహిళలకు సరేనా చట్టాలు లేక ఎంతమంది అబలలు బలైపోతున్నారు ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న మహిళలకు ప్రత్యేక స్థానం ఉన్న సమాజం లోసరైన గుర్తింపు లేక ఆడబిడ్డలు బలైపోతున్నారు. స్త్రీ లేకపోతే మనుగడ కష్టం ఒక తల్లిగా చెల్లిగా అక్కగా వదినగా ఇలా చెప్పుకుని పోతే స్త్రీ మూర్తి ఆదిపరాశక్తి అనే విషయం మరవద్దు. ఒకరిని హత్య చేసే హక్కు ఏ చట్టంలో లేదు ఎందుకు చేయాలి!!!! వారి కూడా మనిషే కదా!!! ప్రస్తుతం ఉన్న చట్టాలు ఉన్నప్పటికీ అప్పటి మట్టికే తూతూ మంత్రంగా హడవాడి చేసి వదిలేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించండి మారండి మీతో పాటు అందరిని మార్చండి!! సుజనోభవ సుఖినోభవంతు!!