ప్రధమ పౌరుడికి ( సర్పంచ్ ) మళ్లీ అధికారం
ప్రధమ పౌరుడికి ( సర్పంచ్ ) మళ్లీ అధికారం
- గత ప్రభుత్వంలో నిధులు లేక పంచాయతీలు డీలా
- వైసిపి ప్రభుత్వంలో పారిశుధ్యం అభివృద్ధి శూన్యం
- పంచాయతీలకు ఎన్డీఏ ప్రభుత్వం భరోసా
గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించారు. కనీస నిధులు లేక సర్పంచులు అవమానాలకు గురయ్యారు నియోజకవర్గంలో పూర్తిగా పడకేసిన గ్రామాభివృద్ధి డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయాలన్న బ్లీచింగ్ వెయ్యాలన్న నిధులు లేక సర్పంచులు ఆందోళన చెందేవారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వైసిపి రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించే పరిస్థితి ఏర్పడింది. గ్రామపంచాయతీ కి ప్రథమ పౌరుడు గా సర్పంచ్ ఉండేవారు అటువంటి వ్యక్తికి ఏ అధికారం లేకుండా వైసిపి ప్రభుత్వం చేసింది.గ్రామాల్లో కనీస అభివృద్ధికి నిధులు లేవు. మౌలిక సదుపాయాల ఊసే లేదు. గ్రామీణ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. గ్రామ సభలు జరపడం కూడా రాజకీయ ఒత్తిళ్ళతో మాయమైంది. గ్రామ సభలు జరపకపోతే సర్పంచుల అధికారం పోయే అవకాశం ఉన్నప్పటికీ చాలాచోట్ల వాటిని పటిష్టంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఒక గ్రామానికి ఏం కావాలి..? ఎలాంటి అభివృద్ధి జరగాలి..? వచ్చిన నిధులు ఖర్చులపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన గ్రామసభలు సంవత్సరానికి రెండుసార్లు ఎక్కడ సభలో నిర్వహించలేదు. గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యలను ప్రభుత్వం పక్కన పెట్టేసింది.కేంద్రం నుంచి వస్తున్న నిధులు కేటాయింపులు జరగడం లేదు. అవి పంచాయతీలకు అందడం లేదు. ఇలా అయితే గ్రామ స్వరాజ్యం ఎలా అని సర్పంచులు ఆన్నప్పటికీ అవి సాధ్యపడలేదు.ఇందులో భాగంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రథమ పౌరుడు యొక్క విధులను నేల రాసింది. ఒక ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా పింఛన్ కావాలన్నా ఒక ఇంటి పట్టా కావాలన్నా అన్ని వాలంటరీ. ఈ వ్యవస్థ వల్ల వైసిపి ప్రభుత్వం పూర్తిగా సమాజంలో ఓటు అడిగే హర్గత కోల్పోయింది. ప్రధమ పౌరుడను గ్రామ ప్రజలు ఎన్నుకుంటారు అటువంటి వ్యక్తికి వైసిపి ప్రభుత్వం విలువలు లేకుండా చేసింది. మనం గత ప్రభుత్వాలు తీసుకుంటే ఒక సర్పంచ్ కి హోదా ఉండేది సర్పంచ్ అనగానే గ్రామంలో పెద్దమనిషి కుటుంబ కలహాలు వచ్చిన గ్రామాల్లో వివాదాలు వచ్చిన సర్పంచ్ దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యను విన్నపించుకున్నవారు. అటువంటి సర్పంచికి వైసిపి ప్రభుత్వం వారికి అధికారాలు లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వేరే పనులకు కేటాయించి పల్లెలను నిర్విరాహం చేసింది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అదే విధంగా ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఎన్నికల టైములో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంచాయతీలకు నేరుగా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈనాడు ప్రభుత్వం ఆ పని నెరవేర్చింది.గాంధీజీ కలలు గన్న గ్రామా స్వరాజ్యం “దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్న మౌలిక సూత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందని అందరు ఆశ!!
వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. వాలంటీర్లు గౌరవ వేతనం రూ.5 వేలు అయితే సర్పంచులకు మాత్రం కేవలం గౌరవ వేతనం కింద రూ.3 వేలు మాత్రమే చెల్లించేవారు.
స్థానిక సంస్థలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక అల్లాడిన స్థానిక సంస్థలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తూ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తొలి సంతకం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నట్లయింది.
స్దానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల్ని గత వైసీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు తరచుగా మళ్లించింది. దీంతో స్థానిక సంస్థలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు నిధుల్లేక అల్లాడాయి. దీనిపై సర్పంచ్ లు ఎన్నో పోరాటాలు చేసినా వైసీపీ సర్కార్ మాత్రం వారిని కరుణించలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు యథావిధిగా విడుదల చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ మేరకు స్థానిక సంస్థలకు రూ.250 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక మంత్రి పయ్యావుల తొలి సంతకం చేశారు. ఈ విధంగా చూసుకుంటే సర్పంచులకు గత పూర్వ వైభవం వచ్చి ప్రథమ పౌరుడు గా గుర్తింపు ఉంటుందని అందరం ఆశిద్దాం!!!! దానితోటి పాటు గ్రామాలు అభివృద్ధి చెంది పల్లెలు పట్టుకొమ్మలుగా ఏర్పడి కులవృత్తులకు మంచి అవకాశం ఉండే విధంగా ఈ ప్రభుత్వం పని చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు!!!