ఆంధ్రప్రదేశ్ లో ఇక పై "వాహన్ పోర్టల్"లోనే రవాణాశాఖ సేవలు
ఆంధ్రప్రదేశ్ లో ఇక పై "వాహన్ పోర్టల్"లోనే రవాణాశాఖ సేవలు
ప్రస్తుతం, రవాణాశాఖ కార్యాలయాల్లో సేవలన్నింటినీ రాష్ట్రప్రభుత్వానికి చెందిన "సొంత పోర్టల్ ఈ-ప్రగతితో పాటు వాహన్ పోర్టల్"నూ అమలుచేస్తున్నారు. అయితే, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో "వాహన్ పోర్టల్" ద్వారా మాత్రమే సేవలన్నింటినీ అందించనున్నారు.
• 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖలో ఆన్లైన్ సేవల కోసం ఈ-ప్రగతి వెబ్సైట్ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, LLRల జారీ, వాహనాల బదిలీ, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్వోసీల జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపు వంటి సేవలు అందేవి.
• కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలని "వాహన్ పోర్టల్"ను కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. E-వాహన్ పోర్టలు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) 2016 లో ప్రారంభించింది.
• దీనిని National Informatics Centre పర్యవేక్షిస్తోంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోనూ దీన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాహన్ పోర్టల్ ద్వారానే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతోంది.
• వాహన్ పోర్టల్లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, LLRలు ఇస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతి ద్వారానే అందుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వాహనాల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకోవాలంటే ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు రకాల పోర్టల్స్ కు బదులు ఒకే దానిని అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించారు.
• ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేముందు సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు వాహన్ పోర్టలు ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో అమలుచేస్తున్నారు. వాహన్ పోర్టల్ రాకముందు ఈ-ప్రగతి ద్వారా అందిన సేవల సమాచారాన్ని ఎన్విసీ సర్వర్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటంతో డేటా మొత్తం NICలోకి చేరడంలో ఆలస్యం అవుతోంది. పలు సేవల వివరాలు కనిపించట్లేదు. వీటిని NIC సాంకేతిక నిపుణులు పరిష్కరించాక పూర్తిగా వాహన్ పోర్టల్ ద్వారానే సేవలు అందించనున్నారు.