శేషాచలం అడవుల్లో కనిపించిన అరుదైన శ్రీలంక కప్ప
శేషాచలం అడవుల్లో కనిపించిన అరుదైన శ్రీలంక కప్ప
శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన "శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్" గా పిలిచే "గోధుమ రంగు చెవి పొద కప్ప"ను శేషాచలం అడవుల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కనుగొన్నారు. శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో నివసించే ఈ కప్ప శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం ప్రాంతంలో కనిపించింది.
• ఈ పరిశోధన, ఒకప్పుడు భారతదేశం, శ్రీలంక భూభాగాలు కలిసే ఉండేవన్న వాస్తవాన్ని నిరూపిస్తోంది.
• ఈ అరుదైన కప్ప రాకోఫోరిడే కుటుంబంలోని కప్పల జాతికి చెందింది.
• ఈ కప్పలు ఎక్కువగా తేమతో కూడిన లోతట్టు అడవులు, పర్వత ప్రాంతంలో ఉండే అడవులు, తోటల్లో ఉంటాయి.
• ఈ కప్ప వెనుక చర్మం ముదురు గోధుమ రంగు పట్టీలు, ఇతర గుర్తులతో బూడిద గోధుమ రంగులో ఉంటుంది. భుజాలపై పసుపు-ఆకుపచ్చ రంగు, మధ్యలో ఎరుపు- గోధుమ రంగు, రెండు నలుపు చారలు ఉంటాయి. భుజాలు ముదురు గోధుమ రంగు గుర్తులతో పసుపు-బూడిద రంగులో ఉంటాయి. వెనుక కాళ్ల భాగాలు లేత నీలం రంగులో ఉంటాయి. పాదాల అడుగుభాగాలు తెల్లటి గుర్తులతో నల్లగా ఉంటాయి. ఈ కప్ప జాతి ప్రస్తుతం అంతరించిపోతోంది.