నంద్యాలలో భక్తి శ్రద్దలతో ప్రారంభమైన ఆషాడ మాస పూజలు
భక్తి శ్రద్దలతో ప్రారంభమైన ఆషాడ మాస పూజలు
- అమ్మవారికి పుట్టింటి పట్టు చీర, సారే..
- ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు..
- 06-07-2024 నుంచి 04-08-2024 వరకు వేడుకలు..
ప్రపంచంలో 2 వ శ్రీ జగజ్జననీ దేవాలయంగా వెలసి, నిత్య పూజలు అందుకుంటున్న మొదటి దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నంద్యాల శ్రీజగజ్జననీ అమ్మవారు. నంద్యాల పట్టణంలో ప్రపంచంలో రెండవ దేవాలయంగా శ్రీ జగజ్జననీ దేవాలయం కొలువుదీరింది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు అమ్మవారికి భక్తులు పుట్టింటి పట్టుచీర, సారే తీసుకొని రావడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయంలో పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. సంప్రదాయాలకు ప్రతిరూపంగా దేవాలయం కట్టుబాట్లు ఉంటాయి. మహిళలు, యువతులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని నియమం ఉంది. దర్శనం, పూజలు, కుంకుమార్చన పూజలకు ఒక్కరూపాయి కూడా వసూళ్లు చేయరు. దేవాలయంలో కుంకుమార్చన లో కూర్చున్న వారి గోత్ర నామాలు పలుకుతూ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. దేవాలయంలో కొబ్బరికాయ మనమే భక్తితో కొట్టే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అమ్మవారి దేవాలయం వద్ద టిఫిన్, భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు. అన్ని దేవాలయాల్లో మాదిరి కాకుండా ఈ దేవాలయంలో హారతి పళ్ళెంలో వేసే ప్రతి రూపాయి అమ్మవారి హుండికె చెందుతుంది. అమ్మవారి పటంతో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులు ఇచ్చే డబ్బుతోనే దేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయం నిర్మించకముందు నాగపుల్లయ్య అను భక్తుడి కలలో అమ్మవారు కనిపించి ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేయాలని చెప్పడంతో దేవాలయం నిర్మాణం జరిగింది. కొంత మంది స్నేహితులు దుర్గా ప్రెండ్స్ యూనిట్ గా ఏర్పడి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారికి ఇచ్చే కానుకలతో దేవాలయం నేటి వరకు దిన, దినాభివృద్ధి చెందుతుంది.
ఈ 30 రోజులు ఆషాఢ భక్తుల కోసం
...మొదటి పల్లెం...మంచి రకం పసుపు.
...రెండవ పళ్ళెం..మంచి రకం కుంకుమ.
...మూడవ గంప..పూలదండ,3 రకాల విత్తనం పండ్లు, రకానికి( రెండు పండ్లు), నల్లపూసలు, కాటుక, మైనం, చిన్న అద్దం, దువ్వెన, తాటి నత్తు, సుగంధ ద్రవ్యముల పొడి.
..నాల్గవ గంప...చీర,జాకిట్ ( జకీట్ 80 సెంటి మీటర్లు), ఒక డజన్ గాజులు,సెంటు లేదా స్ప్రే,తాంబూలం,గోరింటాకు కానీ కొన్,చీర 51/2 మీటర్ ఉండాలి( తెలుపురంగు చీరలు,కాటన్ చీరలు పనికిరావు).
ఐదవ గంప...2 రకాల స్వీటు( రకానికి ఐదు) ఒక రకం కారా.
... భక్తాదులు తమ శక్తిని బట్టి ఇండ్లలో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకొనిరావాలి...
1.. శ్రీ జగజ్జననీ మాత దృష్టిలో అందరూ సమానులే,కుల,మత,పేద,ధనిక,నాయకులు,అధికారులు,స్వామీజీలు,పీఠాధిపతులు అనే భేదములు ఉండవు. భక్తాదులు ఎవరైనా సరే కలిసి మెలిసి తమవసతిని,శక్తిని బట్టి ఆషాఢమాసంలో ఏ రోజైనా తీసుకొని రావచ్చు...
2.. భక్తాదులు సుగంధ ద్రవ్యములను ( పచ్చ కర్పూరం ,కుంకుమ పువ్వు,గంధం ఖర్జూరాలు, ఒట్టి వేర్లు, తంగ ముస్తేలు,జాజి కాయ,జాపత్రీ,శ్రీ గంధం చెక్క,కస్తూరి,గోరోజనం) వీటిని దంచి పొడిచేసి తీసుకొనిరావాలి..
3.. భక్తులు పైన తెలిపిన పూజా ద్రవ్యములను కొత్త పళ్ళెం (స్థాంబానం) లలో లేదా గంపలలో మాత్రమే తీసుకొని రావలేయును (సంచుల్లో బట్టలలో తీసుకొనిరాకూడదు) కాయ,కర్పూరం తీసుకొని రావలేయును...
4. శ్రీ మూర్తులు సంప్రదాయ దుస్తులతో, జడ పూర్తిగా చివరి కోసలవరకు అల్లుకొని మడిచి బ్యాండ్ వేసుకొని నుదుట కుంకుమ బొట్టు లేదా తిలకం ధరించి( స్టిక్కర్లు అనుమతించబడవు) రెండు చేతులకు లక్ష్మీప్రదముగా మట్టి గాజులు కూడా ధరించి ఆలయంలో ప్రవేశించడం మన హిందూ ధర్మ సంప్రదాయం.(లేగిన్స్,జీన్స్,స్లీవ్ లెస్, స్కర్ట్,మిడ్డీలు మొదలగునవి నిషేదం). పురుషులు సాంప్రదాయ దుస్తులు తో కుంకుమ బొట్టు ధరించి పంచ,టవల్,ప్యాంటు,షర్టు,కుర్తా,పైజామాలతో ఆలయ ప్రవేశం చేయవలెను.నిక్కరు,బని యన్లు, షార్ట్స్ అనుమతించబడవు, అంత రాలయములో నడుముకు బెల్టు,పర్స్,కర్చిపులు అనుమతించబడవు.అంతరాలయంలో శ్రీ చక్రార్చన కుంకుమ పూజ చేయు దంపతులు సాంప్రదాయ దుస్తులతో రావాలి.పురుషులు ,పంచ,టవలు,ధోవతి- టవలు. స్రీలు చీరె,రవిక ధరించి రావాలి.
...శ్రీ జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె - సారే మహత్యం.
...శ్రీ జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీరె_ సారే అనే సాంప్రదాయం ఈనాటిది కాదు.అమ్మవారు ఈ సర్వే జగత్తును సృష్టించిన తొలిథినాలనుంచే త్రిమూర్తులు, త్రి మాతలు మొదలు ముక్కోటి దేవతలు అందరూ కూడా అమ్మధీక్ష బూని ఆషాఢంలో కానుకలు అర్పించి ఇష్ట కామ్య సిద్ధిని పొందినట్లు జనశృతి సృష్టించుటకు బ్రహ్మ పోషణకు మహా విష్ణువు లయం చేయుటకు శివుడు అమ్మను ధ్యానించి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మ ఆశీస్సులతో అమ్మ శక్తిని తోడుగా పొంది ఈ శక్తిని పొందినవారేనని జన శృతి. ఈ విధంగా దేవతలు, గంధర్వులు, యక్ష్యులు, కిన్నెరలు, కింపురుషులు, నాగులు, దానవులు, అమ్మను ఆరాధించి మనోసంకల్పములు పొందినవారే. తరువాతి కాలములో శ్రీరాముడు ఈ సమస్త భూమాండలమును ధర్మంగా, సుభిక్షంగా పరిపాలించుటకు శక్తి పూజలు చేసినట్లు జనుల వాడుక. తర్వాత శ్రీ కృష్ణుడు శమంతక మణి విషయంలో తన మీద వచ్చిన నిందను తొలగించుకొనుటకు భగవతి ఆశీస్సులు పొందినట్లు గాథలు,కౌరవుల మాయా జూదముతో రాజ్యాన్ని పోగొట్టుకున్న పాండవుల చేత శ్రీ కృష్ణపరమాత్మ జగన్మాత పూజలు చేయించి వారితో ఆషాఢంలో తగు ఉపాయణములు అందించి ఆ తల్లి కృపకు పాత్రులు అయ్యేట్లు చేసినారని ఇతిహాసం.దివి నుంచి భువికి గంగను తెచ్చుటకు దీక్ష బూని ఆ జగన్మాతను అర్చించి మెప్పించినటువంటి భగీరథుడు.మహా ఇల్లాలు,మహాసాధ్వి, సతీ సావిత్రి చనిపోయిన తన భర్తను బతికించుకోగలిగింది.అంటే ఆషాఢంలో జగన్మాత వ్రతం ఆచరించి స్త్రీ లాంఛనాలు సమర్పించి దీర్ఘసుమంగళీగా వరమును పొందడంవల్లనే ఈ కలియుగంలో మానవులు శ్రీ జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె - సారే సమర్పించడం అమోఘం.అఖండం దైవికం ఐనది.ప్రాచినాచారనికి కొత్తరూపు సంతరించుకుంది.
...అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె _ సారే సమర్పించడం వలన ముఖ్యంగా మహిళలు అత్యంత మంగళప్రదమైన దీర్ఘసుమంగళీ తత్వమును పొందడమే కాక తమ పిల్లా పాపలతో ,పాడి పంటలతో ,సంతోషాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తో తుల తూగుతూ తమ తర్వాతి తరాల వారికి కూడు,గుడ్డు నిడలకు లోటు రాకుండా చేసుకోవడంతో పాటు తమ కుటుంబ వ్యవస్థను అత్యంత శక్తి వంతంగా తీర్చిదిద్దుకోగలరణడంలో ఎలాంటి సందేహం లేదు.
..ఈ పుట్టింటి చీరె_ సారే పూజలో సమర్పించే పూజా ద్రవ్యములు అన్ని కూడా ప్రతి మహిళా దీర్ఘసుమంగళీ తత్వమును పొందుటకు ఉన్న సదనములే పసుపు కుంకుమ పూలు గాజులు,కాటుక,మైనం,మెట్టలు,పట్టీలు,లక్ష్మీప్రదంగా తలవెంట్రుకలు చివరివరకూ అల్లుకొని ముడివేయడం వెంట్రుకలు విరబోసుకోవడం,సగం జడ వేసుకోవడం,చివర్లు వదలిపెట్టడం ఆ లక్ష్మి ప్రదం కావున మంచిది కాదు.లక్ష్మి ప్రదంగా ఉన్నప్పుడే కదా దీర్ఘసుమంగళీ తత్వం సిద్దించేది.