ద్వి చక్ర వాహనదారులకు శిరస్ట్రాణము తప్పనిసరి మరియు ర్యాగింగు పై
ద్వి చక్ర వాహనదారులకు శిరస్ట్రాణము తప్పనిసరి మరియు ర్యాగింగు పై
జి.పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు అవగాహన సదస్సు
కర్నూలు జూలై 09 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గారు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కు సంబందించిన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యస్. మనోహరు గారు ఈ రోజు అనగా 09.07.2024 న జి.పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు అవగాహన నిర్వహించి W. P. లో గౌరవనీయులైన హైకోర్టు (Pil)నo. 116/2024 తీర్పు ప్రకారం ద్విచక్ర వాహనదారులు రక్షిత శిరస్ట్రాణాము (హెల్మెట్) మోటారు వాహనాల చట్టం మరియు దాని క్రింద రూపొందించిన నియమాలు శిక్షపరమైన నిభందనలు మొదలైన వాటి యొక్క దుష్ప్రభావాల గురించి, హెల్మెట్ వాడకం ను టూ వీలర్ నడిపే వారికీ అవగాహన కల్పించాలని ప్యానెల్ లాయర్లు కు, పారా లీగల్ వొలున్తీర్స్ కు, కోర్టు సిబ్బంది కి షార్ట్ ఫిల్మ్ వేసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల బారినపడకుండా ఖచ్చితంగా శిరస్త్రాణం ధరించాలన్నారు. వాహనదారుని తో పాటు వారితో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతిఒక్కరు రహదారి నిబంధనలు పాటించాలన్నారు.
మరియు ఈ కార్యక్రమంలో ర్యాగింగ్ నిరోధంపై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ర్యాగింగ్ యొక్క దుష్ప్రభావాల గురించి, విద్యా సంస్థలలో ర్యాగింగ్ నిషేధానికి సంబంధించిన శిక్షాపరమైన నిబంధనలు మరియు ర్యాగింగ్ కు పాల్పడిన వ్యక్తుల పై భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం వారికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి. నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష పరిమాణం మారుతుంది అని తెలియజేశారు.
ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన నిర్వహించడం మరియు ర్యాగింగ్‌లో పాల్గొనడంపై శిక్షాస్పద నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు ర్యాగింగులో పాల్గొన్న అందుకు ప్రోత్సహించిన వారికి శిక్ష విధించబడును, దీని వల్ల విద్యార్థులకు భవిష్యత్ లో సమస్యలు ఏర్పడును. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎస్.మనోహర, జి.పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ వై.మురళిధర రెడ్డి, జిల్లా రవాణా కమిషనర్ శ్రీధర్, ట్రాఫిక్ సి.ఐ. గౌతమి, ఆర్.టి.ఓ. రమేశ్, తాలూకా సి.ఐ. ఎం.శ్రీధర్, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.