కష్టాల్లో చేనేత పరిశ్రమ
కష్టాల్లో చేనేత పరిశ్రమ
మూతపడ్డ చేనేత సంఘాలు
ఆస్కో సంస్థను పునర్దించాలి
వరి తర్వాత రెండవ పరిశ్రమ చేనేత
పిఠాపురం/యు కొత్తపల్లి, జూలై 09 (పీపుల్స్ మోటివేషన్):-
మనిషి జీవించాలంటే కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో ప్రధానం. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరముందనడంలో అతిశయోక్తిలేదు.
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేవరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం.భారతీయత సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం, మరియు మన దేశానికి గర్వకారణం.
దేశంలో వరి పంట తర్వాత రెండవ అతిపెద్ద పరిశ్రమ చేనేత అటువంటి పరిశ్రమ ఈనాడు కనుమరుగవుతుంది దానికి కారణం ప్రభుత్వాల వైఫల్యం గతంలో ప్రభుత్వాలు చేనేతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆదుకునేవారు చేనేత సహకార సంఘంలో తయారుచేసిన వస్త్రాలను ఆప్కో సంస్థ ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లో అమ్మేవారు. గత 15 సంవత్సరాల నుండి ఆప్కో సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వలేక చేనేత కార్మికులకు పని కల్పించలేకుండా సంఘాలు మూతపడ్డాయి. దీంతో చేనేత కార్మికులు మాస్టర్ వివర్స్ ను ఆశ్రమించారు. గతంలో చేనేత సంఘంలో నేత నేసేవారికి అనేక రకాలైన బెనిఫిట్స్ వచ్చేవి వాటిని చేనేత కార్మికులు ప్రస్తుతం కోల్పోయారు. కొద్దిరోజులు పోతే రాబోయే తరానికి ఈ చేనేత మగ్గం తెలియకపోవచ్చు. రాను రాను చేనేత వస్త్రాలు తగ్గి పవర్లూమ్స్ వస్త్రాలు రావడం జరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి ఇంట్లో 3 లేక 4 చేనేత మగ్గాలు ఉండేవి అవి ప్రస్తుతం ఒకటి వరకు వచ్చాయి. కొంతమంది ఉపాధి లేక వేరే వృత్తికి వెళ్లిపోవడం జరుగుతుంది. మాస్టర్స్ వివర్స్ చేనేత కార్మికులకు పని కల్పించలేకపోతున్నారు తయారు చేసిన వస్త్రాలు నిల్వ ఉండడం ఎగుమతిలు లేకపోవడంతో పూర్తిగా పని కల్పించలేకపోతున్నారు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకు కష్టకాలమే!!! ప్రస్తుత ప్రభుత్వం చేనేత పరిశ్రమను ఆదుకొని గత పూర్వ వైభవం తీసుకురావాలని చేనేత సహకార సంఘాలు పునరుద్ధరణ చేయాలని ఆఫ్కో సంస్థ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలలో సరైన నిధులు కేటాయించాలని.చేనేత కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉన్నవాళ్ళకి మాత్రమే చేనేత రుణాలు ఇవ్వాలి.చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
రాజ్యాంగం ప్రకారం చేనేత కార్మికులకు స్వయం ఉపాధి కల్పించాలి.
ముడి సరుకు పెరుగుదల:-
ముడిసరుకు ధరలు పెరుగుదల - కాటన్/నూలు, సిల్క్, జనప ధరలు పెరగడం; ఎరువులు పురుగు మందులు, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు కూడా పెరిగాయి. మౌలిక సదుపాయాల కల్పన - పెట్టుబడులు లేకపోవడం; ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీసావసరాలైన స్థలం, నీళ్ళు, విద్యుత్తు కూడా అందుబాటులో లేవు.
మార్కెట్ల వ్యవస్థ సదుపాయాలు లేకపోవడం. • చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు `పేటెంట్’ లేకపోవడం వల్ల రక్షణ లేదు, అన్ని సంప్రదాయ డిజైన్లు అనుకరించి నకళ్ళు చేస్తున్నారు.
బట్టల మిల్లులు, ఫాక్టరీలు, పవర్లూముల నుంచి చేనేత పరిశ్రమ ఆన్యాయమైన పోటీ ఎదుర్కుంటోంది, చేనేత డిజైన్లు నకలు/ కాపీ చేసి, పవర్లూమ్లులు అవే చేనేత అని చెప్పుకుని చెలామణి అయిపోతున్నాయి. పైగా ఫ్యాక్టరీలకి, పవర్లూములకి ప్రభుత్వ సబ్సిడీలు కూడా దొరుకుతాయి.ఇది నూతన యుగం, రంగులు డిజైన్లు క్షణక్షణం మారుతుంటాయి. కొత్త డిజైన్ల కొరత పరిశ్రమను దెబ్బతీస్తోంది. ఇది చేనేత కళాకారులు చేయలేక కాదు, డబ్బు పెట్టేవాళ్ళు `రిస్క్’ లేకుండా వ్యాపారం చేయాలనుకోవడం కారణం. ఈ కారణాలతో వ్యాపారం పూర్తిగా దెబ్బతిని చేనేత పరిశ్రమ నష్టాల్లో ప్రస్తుతం ఉంది. కొన్నిచోట్ల నకిలీ చీరలు తయారుచేసి అమ్మడం. నూలు ధరలు పెరగడం ఇవన్నీ కూడా చేనేత పరిశ్రమ ఎదుగుదలకు దెబ్బతీశాయని కొంతమంది చేనేత కార్మికులు వాపోతున్నారు.