Cyber Crime: అలాంటి లింక్స్ వస్తే క్లిక్ చేయవద్దు...సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిక..!
Cyber Crime: అలాంటి లింక్స్ వస్తే క్లిక్ చేయవద్దు...సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిక..!
ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసు వారి తస్మాత్ జాగ్రత్త... SBI rewardz Points పేరుతో Fraud చేస్తూ చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్ళు .... సైబర్ నేరగాళ్ళు రోజుకో కొత్తపంథా ఎంచుకుంటు సైబర్ పోలీస్లకి సవాలు విసురుతున్నారు. క్రిడెట్ కార్డు మరియు డిబెట్ కార్డు యొక్క రివార్డ్ పాయింట్ గడువు త్వరలోనే ముగుస్తుందని కస్టమర్లకి మెసేజ్ పంపించి మరియు sbi net Banking reward ఈరోజే ముగుస్తుందని, అందుకుగాను ఒక SBI rewardz Points. Apk file ని install చేసుకుని మీ యొక్క rewards ని మే యొక్క బ్యాంక్ అకౌంటు నందు cash deposit చేసుకోవాలని whatsapp నందు మెసేజ్ రూపములో వస్తుంది. దానితో పాటు ఒక apk ఫైల్ ని కూడా పంపుతూ, ఆ apk ఫైల్ ని install చేసుకోవాలని కొరతారు. అది నమ్మి ఆ apk ఫైల్ ని డౌన్లోడ్ చేయటం ద్వార డబ్బులు పోగొట్టుకుంటున్న సైబర్ భాదితుడు మోసపోతున్న వారిలో ఎక్కువగా చదువుకున్నవారే ఉండడం గమనార్హం...
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది కారణం చదువుకున్నవారు ముఖ్యంగా సాఫ్టవేర్ ఉద్యోగులు, పదవి విరమణ చేసేవారు, గృహిణులు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు.
నేర విధానం వివరంగా :
1. మొదటిగా భాదితుడికి ఒక తెలియని ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ రావడం జరుగుతుంది.
2. దానిని తెరిచి చూడగా అందులో మీ యొక్క బ్యాంకు క్రిడెట్ లేదా డిబెట్ కార్డు రివార్డ్ పాయింట్స్ గడువు త్వరలో ముగుస్తుందని ఉంటుంది.
3. ఆ రివార్డ్ పాయింట్స్ ను నగదు గా మార్చుకొనుటకు వాళ్ళు పంపిన apk ఫైల్ పై క్లిక్ చేయ్యాలని ఒక apk ఫైల్ ఆ మెసేజ్లో పొందుపరుస్తారు.
4. బాధితుడుకు అది నిజం అని నమ్మేలా ఉంటుంది తర్వాత ఆ apk ఫైల్ ని క్లిక్ చెయ్యగానే మీ యొక్క ఫోన్ హాక్ అయ్యి దానిలో మీ బ్యాంక్ అకౌంటు వివరాలు సైబర్ నెరగాడికి అందుతాయి.
5. భాధితుడు తెరుకునేలోగా అతని bank అకౌంటు నుంచి డబ్బు మాయమవుతుంది.
6. మరికొన్ని సందర్భాలలో బాధితుని ఫోన్ నుండి Fraudster నెంబర్ కి మెసేజ్ Fraudster చేయించుకొని OTP లని వచ్చే విధముగా చేసుకొని తద్వారా బాధితుడి ఎకౌంటు నుంచి డబ్బులు తస్కరిస్తారు.
7. ఈ విధంగా బాధితుడు సైబర్ మోసగాళ్ళు చేతిలో మోసపోతాడు.
సైబర్ క్రైమ్ అవేర్నెస్ :-
యావన్మంది ప్రజానీకానికి సైబర్ క్రైమ్ పోలీసు వారి విజ్ఞప్తి తెలియని నెంబర్స్ నుంచి రివార్డ్ పాయింట్స్ వచ్చాయి అనే లింకు లేదా apk ఫైల్ ని క్లిక్ చేయండి అని మెసేజెస్ వస్తే వెంటనే డిలిట్ చేసేయండి, ఎలాంటి links ని క్లిక్ చేయవద్దు.