Medicine: ఫార్మా మెడిసిన్ మరియు జనరిక్ మెడిసిన్ మద్య తేడా ఏమిటి? ఏది మంచిది? వాటిని ఎలా గుర్తించాలి?
Medicine: ఫార్మా మెడిసిన్ మరియు జనరిక్ మెడిసిన్ మద్య తేడా ఏమిటి? ఏది మంచిది? వాటిని ఎలా గుర్తించాలి?
జెనరిక్ మెడిసిన్ అనేది డోస్, బలం, నాణ్యత మరియు ఉద్దేశించిన ఉపయోగంలో బ్రాండ్-నేమ్ ఉత్పత్తికి సమానమైన ఔషధం, కానీ బ్రాండ్ పేరును కలిగి ఉండదు. అవి సాధారణంగా బ్రాండ్-నేమ్ వెర్షన్‌ల కంటే చౌకగా ఉంటాయి. ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అనేది ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన వైద్య శాఖను సూచిస్తుంది.
ప్రధాన తేడాలు
#పేటెంట్ స్థితి….
🔹 ఫార్మా మెడిసిన్…. బరిజినల్ తయారీదారు కంపెనీకి పేటెంట్ హక్కులు ఉంటాయి.
🔹 జనరిక్ మెడిసిన్…. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత ఇతర కంపెనీలు తయారు చేస్తాయి.
#ధర….
🔹 ఫార్మా మెడిసిన్… సాధారణంగా ఖరీదైనవి.
🔹 జనరిక్ మెడిసిన్… చౌకగా లభిస్తాయి.
#బ్రాండ్ పేరు….
🔹 ఫార్మా మెడిసిన్… ప్రత్యేక బ్రాండ్ పేరుతో అమ్ముతారు.
🔹 జనరిక్ మెడిసిన్… సాధారణంగా జనరిక్ పేరుతో లభిస్తాయి.
#పరిశోధన మరియు అభివృద్ధి….
🔹 ఫార్మా మెడిసిన్…. ఒరిజినల్ కంపెనీ చేసిన పరిశోధన ఫలితం.
🔹 జనరిక్ మెడిసిన్…. ఇప్పటికే ఉన్న ఫార్ములాను అనుసరిస్తాయి.
గుర్తించే విధానం
@పేరు….
🔸 ఫార్మా మెడిసిన్…. ప్రత్యేక బ్రాండ్ పేరు (ఉదా: Crocin)
🔸 జనరిక్ మెడిసిన్… సాధారణ పేరు (ఉదా: Paracetamol)
@ప్యాకేజింగ్….
🔸 ఫార్మా మెడిసిన్…. ఆకర్షణీయమైన, బ్రాండెడ్ ప్యాకేజింగ్
🔸 జనరిక్ మెడిసిన్…. సాధారణ ప్యాకేజింగ్
@ధర….
🔸 ఫార్మా మెడిసిన్…. ఎక్కువ ధర
🔸 జనరిక్ మెడిసిన్…. తక్కువ ధర
@తయారీదారు…..
🔸 ఫార్మా మెడిసిన్…. ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు
🔸 జనరిక్ మెడిసిన్…. చిన్న లేదా స్థానిక కంపెనీలు
@మందు పేరు…
🔸 ఫార్మా మెడిసిన్…. బ్రాండ్ పేరు ప్రముఖంగా ఉంటుంది
🔸 జనరిక్ మెడిసిన్… జనరిక్ పేరు ప్రముఖంగా ఉంటుంది
గమనిక….. రెండు రకాల మందుల్లో ప్రభావం మరియు సురక్షితత్వం సమానంగా ఉంటాయి. ఏ మందు వాడాలో మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.