Energy Drink: ఆ రెండు డ్రింకులు కలిపి తాగితే అంతే సంగతి..!
Energy Drink: ఆ రెండు డ్రింకులు కలిపి తాగితే అంతే సంగతి..!
ఆల్కహాల్ని ఎనర్జీ డ్రింక్తో కలిపితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
మెదడు పనితీరుపై ప్రభావం..
జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం..
Alcohol: ఆల్కహాల్లో ఎనర్జీ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల ప్రమాదం బారినపడే అవకాశం ఉందని ఇటాలియన్ యూనివర్సిటీ పరిశోధన బృందం తేల్చింది. ఈ టీమ్ ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల జీవితకాలం పాటు జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని న్యూరోఫార్మకాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.
పరిశోధన సమయంలో.. మగ ఎలుకలకు ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ లేదా రెండిండింటిని కలయికను ఇచ్చారు. 53 రోజుల వరకు ఎలుకలు ఇలా వీటిని తీసుకున్న తర్వాత, వాటి బిహేవియర్ టెస్టులు చేశారు. వాటి ప్రవర్తనా పరీక్షుల, మెదడు స్కాన్లను ఉపయోగించారు. ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ కలిపి తీసుకున్న ఎలుకల్లో జ్ఞాపకశక్తి, లర్నింగ్ స్కిల్స్లో సమస్యలు ఎదురయ్యాయని పరిశోధన తేల్చింది. ముఖ్యంగా జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే మెదడులోని హిప్పోకాంపస్లో మార్పులను కనుగొన్నారు.
మెదడు అభివృద్ధికి కీలకమైన యుక్తవయస్సులో ఈ పానీయాలను కలిపి తీసుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల గురించి చాలా తక్కువగా తెలుసునని పరిశోధకులు గుర్తించారు. యువకుల మెదడు ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఎనర్జీ డ్రింక్స్ ఆల్కహాల్ మిక్స్ చేయడం వల్ల హిప్పోకాంపస్ యొక్క ప్లాస్టిసిటీని ప్రభావితం చేయవచ్చు, ఇది నేర్చుకునే మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం తెలియజేసింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో మొదట ఈ రెండు పానీయాలు కలిపి తీసుకున్న తర్వాత మెదడు పనితీరులో తాత్కాలిక పెరుగదల కనిపించినప్పటికీ, కాలక్రమేణా క్షీణించినట్లు తేలింది.
యుక్త వయసులో ఎనర్జీ డ్రింక్తో తో కలిపి ఆల్కహాల్ తాగడం వల్ల హిప్పోకాంపస్లో ఎలక్ట్రిక్, మాలిక్యులర్ స్థాయిల్లో మార్పులకు దారి తీస్తుందని, ఇది ప్రవర్తనా మార్పులతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ఫలితాలను నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమవువతాయని పరిశోధకులు చెప్పారు. నిజానికి ఈ రెండు పానీయాల వల్ల ప్రమాదం ఉంటుందని, వీటిని కలిపి తీసుకుంటే మరింత ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు.