Governers: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు... తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ..!
Governers: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు... తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ..!
- పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం..
- తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
- ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు..
- రాజకుటుంబ నేపథ్యం.. అయోధ్య ఉద్యమంలో పాత్ర..
దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. అలాగే తెలంగాణ కు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ను నియమించారు. మరికొందరికి స్థాన చలం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ గవర్నర్...
జిష్ణుదేవ్ ఆగష్టు 15, 1957న జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం
• హరిబాబు కిషన్ రావ్ బాగ్దే రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు.
• తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు.
• ఓం ప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్ గా నియమితులయ్యారు.
• సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
• ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా రామన్ దేకా నియమితులయ్యారు.
• సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్ గా నియమితులయ్యారు.
• ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్ గా పంపారు.
• అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్ గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ నియమించారు.
• సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్ పంపుతూ.. మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.