Heavy rainfall: ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ
Heavy rainfall: ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ
పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్..
లిస్టు విడుదల చేసిన ఐఎండీ..
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది.
జమ్మూ కాశ్మీర్, పశ్చిమ రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ,గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు నివాసాలు కూడా పడిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.